గుడి ముందు భిక్షాటన చేసి.. అదే ఆలయానికి రూ.8 లక్షలు విరాళం!

గుడి మెట్లపై ఉండి అడుక్కునే బిచ్చగాడు అదే ఆలయానికి ఏకంగా 8 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చాడు. అతడు ఇచ్చిన డబ్బుతో గుడిని అభివృద్ధి చేయడంతో పాటు ఓ గోశాల కూడా నిర్మించామని చెబుతున్నారు ఆలయ అధికారులు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు చెందిన 73 ఏళ్ల యాదిరెడ్డి అనే వృద్ధుడు ఓ సాయిబాబా గుడికి ఏడేళ్లుగా విరాళాలు ఇస్తున్నాడు. గతంలో రిక్షా తొక్కి జీవనం సాగించిన ఆయన ముసలితనం కారణంగా మోకాళ్ల నొప్పులు వంటి ఆరోగ్య సమస్యలు రావడంతో […]

గుడి ముందు భిక్షాటన చేసి.. అదే ఆలయానికి రూ.8 లక్షలు విరాళం!
Follow us

| Edited By:

Updated on: Feb 16, 2020 | 9:53 PM

గుడి మెట్లపై ఉండి అడుక్కునే బిచ్చగాడు అదే ఆలయానికి ఏకంగా 8 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చాడు. అతడు ఇచ్చిన డబ్బుతో గుడిని అభివృద్ధి చేయడంతో పాటు ఓ గోశాల కూడా నిర్మించామని చెబుతున్నారు ఆలయ అధికారులు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు చెందిన 73 ఏళ్ల యాదిరెడ్డి అనే వృద్ధుడు ఓ సాయిబాబా గుడికి ఏడేళ్లుగా విరాళాలు ఇస్తున్నాడు. గతంలో రిక్షా తొక్కి జీవనం సాగించిన ఆయన ముసలితనం కారణంగా మోకాళ్ల నొప్పులు వంటి ఆరోగ్య సమస్యలు రావడంతో దేవాలయాల దగ్గర బిచ్చమొత్తుకోసాగాడు.

దీంతో తనకు డబ్బు అవసరం లేదనిపించి ఆలయానికి మరింత మొత్తంలో విరాళాలు ఇవ్వడం ప్రారంభించాడు. నాకు డబ్బులు వెనకేసుకోవాలన్న ఆశ లేదు. తినడానికి ఉంటే చాలు. ఏడేళ్ల క్రితం ఒకసారి వచ్చిన డబ్బులో రూ.1 లక్ష సాయిబాబా గుడికి విరాళంగా ఇచ్చా’ అని చెప్పాడు యాదిరెడ్డి.ఆలయానికి డబ్బు విరాళం ఇచ్చిన తర్వాత తన ఆదాయం మరింత పెరిగిందని తెలిపాడు యాది రెడ్డి. గుడికి డబ్బులు ఇచ్చిన విషయం తెలిశాక చాలా మంది తనను గుర్తుపడుతున్నారని, వాళ్లంతా ఇస్తున్న డబ్బంతా తానేం చేసుకుంటానని అంటున్నాడు. తనకు వచ్చే డబ్బంతా దేవుడికే ఇచ్చేస్తానని చెబుతున్నాడు.

ఆలయ నిర్మాణానికి యాదిరెడ్డి చేసిన సాయం ఎంతో ఉపకరించిందని ఆలయ వర్గాలు తెలిపాయి ఆయన చేసిన సహాయంతో గుడిలో చాలా అభివృద్ధి పనులు చేశామన్నారు. ఆలయానికి అనుబంధంగా ఓ గోశాల కూడా నిర్మించామని చెప్పారు. ఇప్పటి వరకు ఆయన రూ.8 లక్షలు ఇచ్చాడని తెలిపారు. దేవుడిపై ఆయనకు ఉన్న భక్తి భావానికి ఇది నిదర్శనమని, అయితే తాము ఎవరినీ విరాళాలు ఇవ్వాలని అడగమని, భక్తులే తమ శక్తి కొద్ది ఇస్తుంటారని అధికారులు తెలిపారు.