8 నెలల తర్వాత రిటర్న్ టు కామెంట్రీ బాక్స్…ఇంట్లో వాళ్లంతా మస్త్ ఖుష్ ..ఈ సారి నో కాంట్రవర్సీ

సంజయ్ మంజ్రేకర్ చాలా కాలం తర్వాత కామెంట్రీ బాక్స్‌లో కనిపించనున్నారు. రేపటి నుంచి జరిగే భారత్-ఆస్ట్రేలియా సిరీస్‌‌‌లో ఆయన చెప్పే సరదా కామెంట్స్ వినే ఛాన్స్ ఉంది. మార్చి నెల నుంచి..

8 నెలల తర్వాత రిటర్న్ టు కామెంట్రీ బాక్స్...ఇంట్లో వాళ్లంతా మస్త్ ఖుష్ ..ఈ సారి నో కాంట్రవర్సీ
Follow us

|

Updated on: Nov 26, 2020 | 7:25 PM

Sanjay Manjrekar : సంజయ్ మంజ్రేకర్ చాలా కాలం తర్వాత కామెంట్రీ బాక్స్‌లో కనిపించనున్నారు. రేపటి నుంచి జరిగే భారత్-ఆస్ట్రేలియా సిరీస్‌‌‌లో ఆయన చెప్పే సరదా కామెంట్స్ వినే ఛాన్స్ ఉంది. మార్చి నెల నుంచి కామెంట్రీకి దూరంగా ఉన్న సంజయ్ మంజ్రేకర్‌.. ధర్మశాలలో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో కామెంట్రీ చెప్పడానికి వెళ్లలేదు. దీంతో మంజ్రేకర్‌ను బీసీసీఐ కామెంట్రీ ప్యానెల్ నుంచి తప్పించింది. ఐపీఎల్‌లోనూ కామెంట్రీ చెప్పే అవకాశాన్ని బీసీసీఐ అతడికి ఇవ్వలేదు. రెండుసార్లు అతడు లేఖ రాసిన బీసీసీఐ స్పందించ లేదు.

దీంతో కామెంటేటర్‌గా మంజ్రేకర్ కెరీర్ ముగిసిందనే భావన వ్యక్తమైంది. కానీ క్రికెట్ ఆస్ట్రేలియా అతడికి కామెంట్రీ చెప్పే అవకాశం కల్పించింది. మంజ్రేకర్‌‌తోపాటు గ్లెన్ మెక్‌గ్రాత్, నిక్ నైట్, హర్షా భోగ్లే, అజయ్ జడేజా, మురళీ కార్తీక్, అజిత్ అగార్కర్ కూడా ఈ సిరీస్‌లో కామెంట్రీ ప్యానెల్‌లో ఉన్నారు.

నెలల తరబడి నిరీక్షణ తర్వాత కామెంట్రీ చెప్పే అవకాశం రావడంతో సంజయ్ మంజ్రేకర్ ఉత్సాహంగా ఆస్ట్రేలియా బయల్దేరి వెళ్లారు. ఆ ఉత్సాహన్ని తన ట్విట్టర్ వేదికగా వ్యక్తం చేశారు మంజ్రేకర్.

‘‘ఇంట్లోవాళ్లంతా ఉత్సాహంగా ఉన్నారు. చాలా ఆనందంగా ఉంది. ఎవరేం మాట్లాడం లేదు. కానీ వాళ్లు ఆనందంగా ఉన్నారనిపిస్తోంది. ఎందుకంటే దాదాపు 8 నెలల తర్వాత నేను ఇల్లు వదిలి వెళ్తున్నా’’ అని ట్వట్ చేశాడు. ఎవరైనా ఇంటి నుంచి వెళ్తున్నామంటే బాధగా ఉందంటారు.. ఈయనేంటి ఆనందంగా ఉంది.. ఇంట్లో వాళ్లంతా ఖుషీగా ఉన్నారని అంటున్నాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కానీ ఆయన బాధ వాళ్లకేం తెలుసు పాపం.