సమంత అందాలు చూశారా…

|

Jul 28, 2020 | 7:44 AM

సమంత తనదైన తరహాలో స్పందించారు. తన అందమైన ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఇందులో మోడ్రన్ డ్రెస్ లో మెరిసి పోయారు. బ్లాక్ అండ్ వైట్‌ లుక్‌లో పిచ్చెక్కించారు. అంతేకాదు తన ఫోటోతోపాటు..

సమంత అందాలు చూశారా...
Follow us on

సమంత అక్కినేని… పరిచయం అక్కర్లేని పేరు. చైతూతో పెళ్లి తర్వాత ఓ రేంజ్‌కి ఎదిగింది ఈమె. సాధారణంగా పెళ్లి అయితే.. దాదాపు హీరోయిన్లందరూ ఇంటికే పరిమితమైపోతారు. కానీ.. సమంత మాత్రం మరింత గ్లామరస్‌గా తన కెరీర్‌లో హిట్‌లతో దూసుకుపోతూ ఉంది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సమంత.. తాజాగా ఓ హాట్ ఫొటోను తన ఇన్ట్సాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ హాట్ హాట్ గా వైరల్ అవుతోంది.

తన అందం, ఆరోగ్యం పట్ల శ్రద్ద తీసుకుంటూ యోగా, ధ్యానం లాంటివి చేస్తుంటుంది అక్కినేనివారి కోడలు. ఆరోగ్యంగా ఉంటేనే అందం అంటూ సమంతతో పాటు పలువురు హీరోయిన్స్ ఇదే దారిలో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా యోగా, ధ్యానం లాంటివి చేస్తూ తమ జీవితాన్ని అందంగా మలచుకుంటున్న వారిని ఉద్దేశిస్తూ ప్రముఖ మోడల్, ఫ్యాషన్ డిజైనర్ శిల్పా రెడ్డి ఓ పోస్ట్ పెట్టారు. దీనిపై మంచు లక్ష్మి, అక్కినేని సమంత, రకుల్ ప్రీత్ సింగ్‌లను తమ తమ పిక్స్ షేర్ చేయాలంటూ ట్యాగ్ చేశారు.

ఈ పోస్ట్ చూసిన సమంత తనదైన తరహాలో స్పందించారు. తన అందమైన ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఇందులో మోడ్రన్ డ్రెస్ లో మెరిసి పోయారు. బ్లాక్ అండ్ వైట్‌ లుక్‌లో పిచ్చెక్కించారు. అంతేకాదు తన ఫోటోతోపాటు ఓ కామెంట్‌ను కూడా జోడించారు. ”ఛాలెంజ్ స్వీకరిస్తున్నా.. డిఫరెంట్ సైడ్స్, డిఫరెంట్ షేడ్స్, డిఫరెంట్ ఎమోషన్స్, డిఫరెంట్ ఫీలింగ్స్.. అన్నీ ఒక్కదాంట్లోనే” అని కామెంట్ చేసింది.