సెకండ్ కోవిడ్ వ్యాక్సీన్ కి ఆమోదం, వ్లాదిమిర్ పుతిన్

రెండో కోవిడ్ వ్యాక్సీన్  కి రెగ్యులేటరీ ఆమోదం లభించిందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు.  బుధవారం మాస్కోలో అత్యున్నత స్థాయి సమావేశంలో మాట్లాడిన ఆయన.. సైబీరియాలోని వెక్టార్ ఇన్స్ టి ట్యూట్ డెవలప్ చేసిన శాస్త్రజ్ఞులను అభినందించారు. వారి  టీకా మందు హ్యూమన్ ట్రయల్స్ గతనెలలో పూర్తి అయ్యాయని, ఇదే సమయంలో తొలి, రెండో దశ వ్యాక్సీన్ ఉత్పత్తిని కూడా పెంచవలసి ఉందని చెప్పారు. విదేశీ భాగస్వామ్య కంపెనీలతో సహకారాన్ని మనం కొనసాగిస్తున్నాం.. అలాగే విదేశాల్లో […]

సెకండ్ కోవిడ్ వ్యాక్సీన్ కి ఆమోదం, వ్లాదిమిర్ పుతిన్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 14, 2020 | 9:30 PM

రెండో కోవిడ్ వ్యాక్సీన్  కి రెగ్యులేటరీ ఆమోదం లభించిందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు.  బుధవారం మాస్కోలో అత్యున్నత స్థాయి సమావేశంలో మాట్లాడిన ఆయన.. సైబీరియాలోని వెక్టార్ ఇన్స్ టి ట్యూట్ డెవలప్ చేసిన శాస్త్రజ్ఞులను అభినందించారు. వారి  టీకా మందు హ్యూమన్ ట్రయల్స్ గతనెలలో పూర్తి అయ్యాయని, ఇదే సమయంలో తొలి, రెండో దశ వ్యాక్సీన్ ఉత్పత్తిని కూడా పెంచవలసి ఉందని చెప్పారు. విదేశీ భాగస్వామ్య కంపెనీలతో సహకారాన్ని మనం కొనసాగిస్తున్నాం.. అలాగే విదేశాల్లో రష్యన్ వ్యాక్సీన్ ని ప్రమోట్ చేయవల్సిన అవసరం ఉంది అని పుతిన్ పేర్కొన్నారు. కోవిడ్ వ్యాక్సీన్ కి రెగ్యులేటరీ ఆమోదం పొందిన దేశాల్లో రష్యా తొలి దేశమై రికార్డు సృష్టించింది. సుమారు 400 మంది హైరిస్క్ రోగులకు ఈ వ్యాక్సీన్ ఇఛ్చారు.  స్పుత్నిక్ పేరిట డెవలప్ చేసిన దీన్ని పుతిన్ స్వయంగా తన కూతురికి ఇఛ్చిన సంగతి విదితమే.