హత్రాస్ కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆదివారం వఛ్చిన సమాజ్ వాదీ, రాష్టీయ లోక్ దళ్ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జి చేశారు. ఒక దశలో వారిపై కార్యకర్తలు కూడా తిరగబడడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఈ గ్రామంలో నిషేధాజ్ఞలు అమలులో ఉన్నాయనికేవలం అయిదుగురిని మాత్రమే హత్రాస్ కుటుంబాన్ని పరామర్శించేందుకు అనుమతిస్తామని పోలీసు అధికారులు చెబుతున్నారు. అయితే ఈ రెండు పార్టీల నేతలు, కార్యకర్తలు ఈ నిషేధాజ్ఞలను పట్టించుకోకుండా పెద్ద సంఖ్యలో రావడంతో వారిని పోలీసులు అడ్డగించారు. వారిని అదుపు చేసేందుకు నానా తంటాలు పడ్డారు. కాగా ఇక్కడికి చేరుకున్న ఈ పార్టీల ముఖ్య నాయకులెవరో స్పష్టం కాలేదు.