ఆర్‌బీఐ కీలక నిర్ణయం

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరో కీలక నిర్ణయం తీసుకుంది. గురువారం నిర్వహించిన ద్రవ్యపరపతి విధాన సమీక్షలో మరోసారి రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో రెపో రేటు 6.25 నుంచి 6 శాతానికి తగ్గింది. మిగిలిన అంశాలు యథాతథంగా కొనసాగించాలని మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయించింది. ప్రస్తుత నిర్ణయంతో బ్యాంకులకు చౌకగా రుణాలు లభ్యమవుతాయి. దీంతో రివర్స్‌ రెపో రేటు 5.75శాతంగా ఉండనుంది. ఈ ఏడాది వరుసగా రెండోసారీ రెపో రేటును ఆర్బీఐ […]

ఆర్‌బీఐ కీలక నిర్ణయం
Follow us

| Edited By:

Updated on: Apr 04, 2019 | 4:27 PM

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరో కీలక నిర్ణయం తీసుకుంది. గురువారం నిర్వహించిన ద్రవ్యపరపతి విధాన సమీక్షలో మరోసారి రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో రెపో రేటు 6.25 నుంచి 6 శాతానికి తగ్గింది. మిగిలిన అంశాలు యథాతథంగా కొనసాగించాలని మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయించింది. ప్రస్తుత నిర్ణయంతో బ్యాంకులకు చౌకగా రుణాలు లభ్యమవుతాయి. దీంతో రివర్స్‌ రెపో రేటు 5.75శాతంగా ఉండనుంది. ఈ ఏడాది వరుసగా రెండోసారీ రెపో రేటును ఆర్బీఐ తగ్గించింది. గృహ రుణాలపై వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉంది.