రెండ్రోజులు ఉరుములతో కూడిన వానలు.. రాజధానికి భారీ వర్ష సూచన..

| Edited By:

Jul 04, 2020 | 5:38 AM

ఈసారి నైరుతి రుతుపవనాలు సరైన సమయానికే పలకరించాయి. ఈ క్రమంలో ఏపీ తీరానికి దగ్గర పశ్చిమ బంగాళాఖాతంలో 3.1 ఎత్తువద్ద ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ ప్రభావంతో సూర్యాపేట, నల్లగొండ, ఖమ్మం,

రెండ్రోజులు ఉరుములతో కూడిన వానలు.. రాజధానికి భారీ వర్ష సూచన..
Follow us on

ఈసారి నైరుతి రుతుపవనాలు సరైన సమయానికే పలకరించాయి. ఈ క్రమంలో ఏపీ తీరానికి దగ్గర పశ్చిమ బంగాళాఖాతంలో 3.1 ఎత్తువద్ద ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ ప్రభావంతో సూర్యాపేట, నల్లగొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, వరంగల్‌రూరల్‌, వరంగల్‌అర్బన్‌, వికారాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి, హైదరాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, సిద్దిపేట, వికారాబాద్‌, నారాయణపేట, వనపర్తి, జోగుళాంబ గద్వాల, నాగర్‌కర్నూల్‌, యాదాద్రి భువనగిరి, మహబూబ్‌నగర్‌, మహబూబాబాద్‌ జిల్లాల్లో శనివారం ఉరుములు మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

ఆదివారం పలుచోట్ల ఉరుములతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురువొచ్చని వాతావరణ కేంద్రం అధికారి రాజారావు పేర్కొన్నారు. ఒకటి రెండుచోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. మరోవైపు, నైరుతి రుతుపవనాలకు తోడు ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శని, ఆదివారాల్లో గ్రేటర్‌ హైదరాబాద్‌లోని పలుచోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని చెప్పారు. గ్రేటర్‌లో రెండ్రోజులుగా పగలు ఉక్కపోత ఉండగా, రాత్రి సమయంలో వర్షం కురుస్తున్నది.