యువరాజ్ సింగ్ రిటైర్మెంట్ వెనక్కు తీసుకోవాలి : పీసీఏ

|

Aug 15, 2020 | 8:35 AM

భార‌త‌ మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ మళ్లీ బ్యాట్‌తో మ‌ళ్లీ మెరుపులు మెరిపిస్తాడా? రిటైర్మెంట్‌ వెనక్కి తీసుకుని దేశవాళీ క్రికెట్‌లో చెల‌రేగుతాడా..?.

యువరాజ్ సింగ్ రిటైర్మెంట్ వెనక్కు తీసుకోవాలి : పీసీఏ
Follow us on

భార‌త‌ మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ మళ్లీ బ్యాట్‌తో మ‌ళ్లీ మెరుపులు మెరిపిస్తాడా? రిటైర్మెంట్‌ వెనక్కి తీసుకుని దేశవాళీ క్రికెట్‌లో చెల‌రేగుతాడా..?. ఈ విషయానికి సంబంధించి యూవీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు గానీ పంజాబ్‌ క్రికెట్‌ సంఘం (పీసీఏ) మాత్రం యూవీ తిరిగి క్రికెట్ ఆడాల‌ని బ‌లంగా కోరుకుంటుంది. అన్ని ఫార్మాట్స్‌లో అనుభ‌వం ఉన్న‌ క్రికెటర్‌ రంజీ జట్టుకు అవసరమని భావిస్తోన్న పీసీఏ.. జట్టులో ప్లేయ‌‌ర్‌గా ఉంటూ కుర్రాళ్లకు స‌ల‌హాలు ఇవ్వాల‌ని యువరాజ్​ను కోరింది.

“మళ్లీ ఆడాలని ఆరు రోజుల కిందట యువ‌రాజ్‌ని అడిగాం. అతడి ఆన్స‌ర్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఆటగాడిగా, మార్గనిర్దేశకుడిగా యువరాజ్​ టీమ్‌లో ఉంటే పంజాబ్‌ క్రికెట్‌కు ఎంతో ఉప‌యోగం ఉంటుంది” అని పీసీఏ కార్యదర్శి పునీత్‌ బాలి అభిప్రాయ‌ప‌‌డ్డాడు.

38 ఏళ్ల యువరాజ్‌ గతేడాది ఇంట‌ర్నేష‌న‌ల్, దేశవాళీ క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు. రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకోవడం అంత ఈజీ కాకపోవచ్చు. బీసీసీఐ రిటైరైన ప్లేయ‌ర్స్‌కు మాత్రమే విదేశీ లీగ్‌ల్లో ఆడేందుకు ప‌ర్మిష‌న్ ఇస్తుంది. అలా యువీ ఇప్పటికే రెండు విదేశీ టోర్నమెంటుల్లో పాల్గొన్నాడు.

Also Read : తోటి కోడళ్ల పంచాయితీ : ఏపీ, తమిళనాడులోని రెండు గ్రామాల వివాద‌మైంది