ప్రణయ్ హత్యకేసులో మారుతిరావుకు షాక్..!

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్యకేసులో.. అమృత తండ్రి మారుతీరావుకు కోర్టులో చుక్కెదురైంది. బెయిల్ కోసం పెట్టుకున్న పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. ప్రణయ్ హత్యలో అరెస్ట్ అయిన మారుతీరావు.. ఇటీవల వరంగల్ జైలు నుంచి విడుదలయ్యారు. అనంతరం ప్రణయ్ కుటుంబ సభ్యులు, కూతురు అమృతతో రాజీ ప్రయత్నాలకు ట్రై చేశారు. ఈ క్రమంలో ప్రణయ్ కుటుంబాన్ని బెదిరించడానికి ప్రయత్నించినట్లు కూతురు అమృత ఆరోపిస్తూ.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు మారుతీరావును అరెస్ట్ చేశారు. ఈ […]

ప్రణయ్ హత్యకేసులో మారుతిరావుకు షాక్..!
Follow us

| Edited By: Srinu

Updated on: Dec 13, 2019 | 6:45 PM

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్యకేసులో.. అమృత తండ్రి మారుతీరావుకు కోర్టులో చుక్కెదురైంది. బెయిల్ కోసం పెట్టుకున్న పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. ప్రణయ్ హత్యలో అరెస్ట్ అయిన మారుతీరావు.. ఇటీవల వరంగల్ జైలు నుంచి విడుదలయ్యారు. అనంతరం ప్రణయ్ కుటుంబ సభ్యులు, కూతురు అమృతతో రాజీ ప్రయత్నాలకు ట్రై చేశారు. ఈ క్రమంలో ప్రణయ్ కుటుంబాన్ని బెదిరించడానికి ప్రయత్నించినట్లు కూతురు అమృత ఆరోపిస్తూ.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు మారుతీరావును అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో బెయిల్ కోరుతూ మిర్యాలగూడ జిల్లా అదనపు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే విచారణ చేపట్టిన కోర్టు.. బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది. తదుపరి విచారణ ఈ నెల 17కు వాయిదా వేసింది.

Latest Articles