‘ఎకానమీ తెలియని మోదీ’.. రాహుల్ గాంధీ ధ్వజం

ఎకానమీ (ఆర్ధిక వ్యవస్థ) గురించి ప్రధాని మోదీకి తెలియదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. అసలు ఎకనమిక్స్ పై ఆయన సరిగా స్టడీ చేసినట్టు లేదని కూడా రాహుల్ అన్నారు. మంగళవారం రాజస్థాన్ రాజధాని జైపూర్ లో జరిగిన ఓ ర్యాలీలో పాల్గొన్న ఆయన.. పాత గణాంకాల ప్రకారం భారత వృద్ది రేటు (జీడీపీ) కేవలం 2.5 శాతం మాత్రమే ఉందన్నారు.  విదేశాల్లో భారత ప్రతిష్టను మోడీ దిగజారుస్తున్నారని ఆరోపించారు. యూపీఏ హయాంలో జీడీపీ […]

'ఎకానమీ తెలియని మోదీ'.. రాహుల్ గాంధీ ధ్వజం
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 28, 2020 | 5:14 PM

ఎకానమీ (ఆర్ధిక వ్యవస్థ) గురించి ప్రధాని మోదీకి తెలియదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. అసలు ఎకనమిక్స్ పై ఆయన సరిగా స్టడీ చేసినట్టు లేదని కూడా రాహుల్ అన్నారు. మంగళవారం రాజస్థాన్ రాజధాని జైపూర్ లో జరిగిన ఓ ర్యాలీలో పాల్గొన్న ఆయన.. పాత గణాంకాల ప్రకారం భారత వృద్ది రేటు (జీడీపీ) కేవలం 2.5 శాతం మాత్రమే ఉందన్నారు.  విదేశాల్లో భారత ప్రతిష్టను మోడీ దిగజారుస్తున్నారని ఆరోపించారు. యూపీఏ హయాంలో జీడీపీ 9 శాతం ఉండగా.. క్రమేపీ తగ్గుతూ వస్తోందన్నారు.

ఇప్పుడు ప్రపంచం  మొత్తం ఇండియా వైపు చూస్తోందని, జీడీపీకి వేర్వేరు పారామీటర్లు ఉన్నాయని అన్నారు.  ఇది 5 శాతం ఉన్నట్టు లెక్కలు చెబుతున్నాయని ఆయన పేర్కొన్నారు.’ నోట్లరద్దు (డీమానిటైనైజేషన్) కు వెళ్లిన ఒక వ్యక్తికి జీఎస్టీ అంటే ఏమిటో తెలియదు.. 8 ఏళ్ళ బాలుడ్ని కూడా అడిగినా.. నోట్ల రద్దు మంచి కన్నా చెడే ఎక్కువగా చేసిందని చెబుతాడు ‘అని రాహుల్ వ్యాఖ్యానించారు.  సీఏఏ కు వ్యతిరేకంగా ‘యువ ఆక్రోశ్  ర్యాలీ’ పేరిట జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. భారత గ్లోబల్ ఇమేజీ, సౌభ్రాతృత్వం ఈ దేశ ప్రతిష్టకు మారు పేరుగా నిలిచిందని, పాకిస్తాన్ ను భారతీయులు విమర్శిస్తూ వచ్చారని.. అయితే మోదీ ఈ ప్రతిష్టను నాశనం చేశారని అన్నారు.

ఈ దేశం ప్రపంచంలోని ‘రేప్ క్యాపిటల్’ గా మారిందని దుయ్యబట్టారు. కానీ దీనిపై ప్రధాని ఒక్క మాటకూడా మాట్లాడడంలేదన్నారు. నిరుద్యోగ సమస్య గురించి యువత మాట్లాడితే ఈ ప్రభుత్వం షూట్ చేస్తోందన్నారు. ఇండియాలోని ఏ యూనివర్సిటీకైనా వెళ్లి విద్యార్థులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము మోదీకి ఉందా అని రాహుల్ సవాలు చేశారు. ఆయన సదా తప్పుడు హామీలు ఇస్తుంటారని ఆరోపించారు. ఇలా రాహుల్ తన ప్రసంగంలో ప్రధానిని దుయ్యబట్టారు.

Latest Articles
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు
ఎన్టీఆర్ దేవర షూటింగ్‌లో అపశ్రుతి..ఆస్పత్రిలో 20 మంది ఆర్టిస్టులు
ఎన్టీఆర్ దేవర షూటింగ్‌లో అపశ్రుతి..ఆస్పత్రిలో 20 మంది ఆర్టిస్టులు
సమ్మర్ స్పెషల్ రెసిపీ.. మ్యాంగో మురబ్బా.. పిల్లలకు భలేగా ఇష్టం!
సమ్మర్ స్పెషల్ రెసిపీ.. మ్యాంగో మురబ్బా.. పిల్లలకు భలేగా ఇష్టం!
కేవలం రూ.20 ప్రీమియంతో రూ.2 లక్షల బీమా పాలసీ..మోడీ సర్కార్‌ బెస్ట
కేవలం రూ.20 ప్రీమియంతో రూ.2 లక్షల బీమా పాలసీ..మోడీ సర్కార్‌ బెస్ట