మరో 10 నెలల్లో పాలమూరు ప్రాజెక్టు పూర్తి: సీఎం కేసీఆర్

ఉమ్మడి రాష్ట్రంలో అసమర్థ పాలకుల వల్ల తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. పాలమూరు ఎత్తిపోతల పథకం పనుల పరిశీలనలో భాగంగా వనపర్తి జిల్లా ఏదులలో ఆయన మీడియాతో మాట్లాడారు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ఏడాదిలోగా పూర్తి చేస్తామని సీఎం కేసీఆర్‌ తెలిపారు. పాలమూరు జిల్లాలను పాలుగారే జిల్లాగా మారుస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే పాలమూరు జిల్లాలో 15 నుంచి 18 లక్షల ఎకరాలకు నీరుందుతాయని చెప్పారు. ఏడాదిలోపు పాలమూరు-ఎత్తిపోతల పథకం […]

మరో 10 నెలల్లో పాలమూరు ప్రాజెక్టు పూర్తి: సీఎం కేసీఆర్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 29, 2019 | 8:32 PM

ఉమ్మడి రాష్ట్రంలో అసమర్థ పాలకుల వల్ల తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. పాలమూరు ఎత్తిపోతల పథకం పనుల పరిశీలనలో భాగంగా వనపర్తి జిల్లా ఏదులలో ఆయన మీడియాతో మాట్లాడారు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ఏడాదిలోగా పూర్తి చేస్తామని సీఎం కేసీఆర్‌ తెలిపారు. పాలమూరు జిల్లాలను పాలుగారే జిల్లాగా మారుస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే పాలమూరు జిల్లాలో 15 నుంచి 18 లక్షల ఎకరాలకు నీరుందుతాయని చెప్పారు. ఏడాదిలోపు పాలమూరు-ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేయాలని నిర్ణయించామని, ప్రాజెక్టు పూర్తయితే జిల్లాకు మంచి ఫలితాలు రానున్నాయని చెప్పారు. అదేవిధంగా గోదావరి-కృష్ణా నదుల అనుసంధానం గొప్ప నిర్ణయన్నారు కేసీఆర్ . దీనిద్వారా రెండు తెలుగు రాష్ట్రాలకు మేలు జరగనుందన్నారు. దీనిపై పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చిస్తున్నామని, త్వరలో అవి పూర్తయి ఓ నిర్ణయానికి వస్తామని కేసీఆర్ చెప్పారు. పొరుగు రాష్ట్రాలతో సఖ్యతగా ఉండబట్టే కాళేశ్వరం ప్రాజెక్టును రికార్డు స్ధాయిలో నిర్మించుకున్నామని తెలిపారు కేసీఆర్.