పాక్ పేరును ‘పాకియతాన్’గా మార్చిన పీసీబీ.. ట్వీట్ వైరల్..

పాకిస్థాన్ జట్టు ఇంగ్లాండ్ బయల్దేరుతున్న నేపథ్యంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  ఇక దానికి కారణం లేకపోలేదు.

పాక్ పేరును పాకియతాన్గా మార్చిన పీసీబీ.. ట్వీట్ వైరల్..

Updated on: Jul 01, 2020 | 1:26 PM

దాదాపు మూడు నెలల తర్వాత మళ్లీ క్రికెట్ పండగ మొదలైంది. వెస్టిండీస్, పాకిస్థాన్ జట్లు అంతర్జాతీయ క్రికెట్ ప్రారంభించేందుకు ఇంగ్లాండ్ చేరుకున్నాయి. అయితే పాకిస్థాన్ జట్టు ఇంగ్లాండ్ బయల్దేరుతున్న నేపథ్యంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  ఇక దానికి కారణం లేకపోలేదు. తమ దేశం పేరును పాకిస్థాన్‌కు బదులుగా ‘పాకియతాన్’ అంటూ ఆ ట్వీట్‌లో పీసీబీ పేర్కొనడంతో నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.

‘ఇంగ్లాండ్ బయల్దేరుతున్న తమ జట్టుకు శుభాకాంక్షలు చెబుతూ పీసీబీ ”పాకిస్థాన్ టీమ్ ఇంగ్లాండ్‌కు బయలుదేరింది”.. ”ఆల్ ది బెస్ట్ బాయ్స్’ అంటూ పీసీబీ ట్వీట్ చేసింది. ఇది కాస్తా నెట్టింట్లో వైరల్ అయింది. సొంత దేశం పేరునే తప్పుగా రాయడం ఏంటని ఆ దేశవాసులు మండిపడగా.. నెటిజన్లు సెటైర్లు వేశారు. పీసీబీ తన తప్పు తెలుసుకుని ట్వీట్‌ని డిలీట్ చేసేలోపు జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

Also Read: కరోనా ఎఫెక్ట్: జింబాబ్వే- ఆస్ట్రేలియా సిరీస్ రద్దు..