గాలిలో దీపం కుమారస్వామి భవిత.. మరో మూడు గంటల్లో ఏం తేలనుంది?

కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి రాజకీయ భవిత సోమవారం తేలనుంది. పతనం అంచులమీద కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్-జేడీ-ఎస్ సంకీర్ణకూటమి ప్రభుత్వ మనుగడపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. అసెంబ్లీలో కుమారస్వామి బల పరీక్ష జరుగుతుందా లేదా అన్నది మొదట స్పష్టం కాలేదు. అయితే విశ్వాసపరీక్ష ఉంటుందని స్పీకర్ రమేష్ కుమార్ ఆ తరువాత ప్రకటించారు. మధ్యాహ్నం 3గంటలకు ట్రస్ట్ ఓట్ జరుగుతుందని పేర్కొన్నారు. రెబల్ ఎమ్మెల్యేలు తిరిగి రావాలని, బీజేపీ ఎత్తుగడలను ఎదుర్కోవాలని కుమారస్వామి అభ్యర్థించారు. అయితే తాము అసెంబ్లీకి హాజరయ్యే ప్రసక్తే […]

గాలిలో దీపం కుమారస్వామి భవిత.. మరో మూడు గంటల్లో ఏం తేలనుంది?
Follow us

| Edited By:

Updated on: Jul 22, 2019 | 12:03 PM

కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి రాజకీయ భవిత సోమవారం తేలనుంది. పతనం అంచులమీద కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్-జేడీ-ఎస్ సంకీర్ణకూటమి ప్రభుత్వ మనుగడపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. అసెంబ్లీలో కుమారస్వామి బల పరీక్ష జరుగుతుందా లేదా అన్నది మొదట స్పష్టం కాలేదు. అయితే విశ్వాసపరీక్ష ఉంటుందని స్పీకర్ రమేష్ కుమార్ ఆ తరువాత ప్రకటించారు. మధ్యాహ్నం 3గంటలకు ట్రస్ట్ ఓట్ జరుగుతుందని పేర్కొన్నారు. రెబల్ ఎమ్మెల్యేలు తిరిగి రావాలని, బీజేపీ ఎత్తుగడలను ఎదుర్కోవాలని కుమారస్వామి అభ్యర్థించారు. అయితే తాము అసెంబ్లీకి హాజరయ్యే ప్రసక్తే లేదని రెబల్ ఎమ్మెల్యేలు ఖరాఖండిగా చెబుతున్నారు.తమను బందీలు చేశారన్న ఆరోపణను వారు తోసిపుచ్చారు. ఈ రాష్ట్రానికి ఏదైనా ‘ మంచి ‘ జరుగుతుందని తాము ఆశించామని, కానీ అలాంటిదేమీ జరగలేదని వారు విమర్శించారు .ప్రస్తుతం ముంబై లోని హోటల్లో ఉన్న తాము బెంగుళూరుకు వచ్ఛే ప్రసక్తి లేదన్నారు. అటు-తనకు అధికార దాహం లేదని, కుర్చీని అంటిపెట్టుకుని కూర్చోవాలన్న ఆశ తనకు లేదని కుమారస్వామి పేర్కొన్నారు. సభలో విశ్వాస పరీక్షపై జరిగే చర్చకు సమయం ఇవ్వాలని మాత్రమే తానుకోరుతున్నానని అన్నారు. రెబల్ ఎమ్మెల్యేల సమస్యలపై చర్చించేందుకు తాను రెడీగా ఉన్నానని, వారు ఎప్పుడైనా తనతో మాట్లాడవవచ్ఛునని ఆయన చెప్పారు.

కర్ణాటక అసెంబ్లీలో తమ పార్టీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే మహేష్ ని విశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయాలని బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి ఆదేశించడంతో కుమారస్వామి సర్కార్ కి స్వల్ప ఊరట లభించింది. ఇక..అవకాశంకోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బీజేపీ నేత, మాజీ సీఎం యెడ్యూరప్ప.. కుమారస్వామి ప్రభుత్వానికి సోమవారమే చివరి రోజని వ్యాఖ్యానించారు. సభలో విశ్వాస తీర్మానం ప్రవేశపెడితే దానికి వ్యతిరేకంగా తమ ఎమ్మెల్యేలు ఓటు వేస్తారని ఆయన చెప్పారు. కాగా-ప్రభుత్వాన్ని కాపాడేందుకు ఎవరినైనా ముఖ్యమంత్రిగా ఎంపిక చేయాలని కుమారస్వామి కాంగ్రెస్ పార్టీ నేతలకు చెప్పారని ఈ పార్టీ సీనియర్ నేత, మంత్రి డి.కె.శివకుమార్ పేర్కొన్నట్టు తెలుస్తోంది. అయితే ఇది అనధికార వార్తేనని సమాచారం.