F3 Movie Updates: సంక్రాంతి అల్లుళ్లకు ఈసారి నో హాలిడేస్.. పండుగ పూట కూడా సెట్‌లోనే.. అనిల్ అల్టిమేటం !‌

| Edited By: Anil kumar poka

Jan 08, 2021 | 1:04 PM

పాపం... సీనియర్ హీరో వెంకటేష్‌... యంగ్ హీరో వరుణ్ తేజ్‌కు ఈ సారి సంక్రాంతి హాలీడేస్‌ లేవు. ఇప్పటికే డీలే కావటంతో ఫెస్టివల్‌ డేస్‌లోనూ...

F3 Movie Updates: సంక్రాంతి అల్లుళ్లకు ఈసారి నో హాలిడేస్.. పండుగ పూట కూడా సెట్‌లోనే.. అనిల్ అల్టిమేటం !‌
Follow us on

F3 Movie Updates:  పాపం… సీనియర్ హీరో వెంకటేష్‌… యంగ్ హీరో వరుణ్ తేజ్‌కు ఈ సారి సంక్రాంతి హాలీడేస్‌ లేవు. ఇప్పటికే డీలే కావటంతో ఫెస్టివల్‌ డేస్‌లోనూ ఎఫ్ 3 షూటింగ్‌కు బ్రేక్ ఇవ్వకూడదని ఫిక్స్ అయ్యారు మేకర్స్‌. ఈ ఇయర్‌ సంక్రాంతి… ఈ ఇద్దరు హీరోలకు చాలా ఇంపార్టెంట్‌.. అయినా సరే షూటింగ్‌కే ఫస్ట్‌ ప్రిఫరెన్స్ అంటున్నారు వెంకీ, వరుణ్‌.

దగ్గుబాటి ఫ్యామిలీ స్టార్‌ రానా.. ఈ మధ్యే పెళ్లి చేసుకున్నారు. మెగా డాటర్‌ నీహారిక కూడా కొత్త పెళ్లికూతురే. కాబట్టి.. దగ్గుబాటి, కొణిదెల ఫ్యామిలీస్‌ ఈ సంక్రాంతిని స్పెషల్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నాయి. సంక్రాంతి పండుగ అంటేనే కుటుంబాలు అంతా ఒక చోట చేరి ఆటపాటలతో చేసుకునే పండుగ.  అయినా సరే ఒకే ఒక్క రోజు సెలబ్రేషన్స్ కోసం కేటాయిస్తున్నారు ఇద్దరు హీరోలు.

ఈ మధ్య వరుణ్‌కు కరోనా రావటంతో ఎఫ్ 3 షూటింగ్ వాయిదా పడింది. ఆ గ్యాప్‌ను కవర్‌ చేయడానికే ఫెస్టివల్‌ డేస్‌లోనూ షూటింగ్ ప్లాన్ చేశారు దర్శకుడు అనిల్‌ రావిపూడి. హీరోలు కూడా రెడీ అనటంతో సంక్రాంతికి నో బ్రేక్ అని ఎఫ్‌ 3 యూనిట్‌ మొత్తానికి చెప్పేశారు.

Also Read :