ఆర్మేనియా-అజర్‌బైజాన్‌ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం తూచ్‌!

రష్యా జోక్యంతో కాసేపు సంయమనంతో వ్యవహరించినట్టు కనిపించిన అజర్‌బైజాన్‌, ఆర్మేరియాలు మళ్లీ కొట్టుకుచస్తున్నాయి.. పక్కపక్కనే ఉన్నాయి కానీ పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత శత్రుత్వం వచ్చేసింది ఆ దేశాలకు..

ఆర్మేనియా-అజర్‌బైజాన్‌ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం తూచ్‌!
Follow us

|

Updated on: Oct 12, 2020 | 8:59 AM

రష్యా జోక్యంతో కాసేపు సంయమనంతో వ్యవహరించినట్టు కనిపించిన అజర్‌బైజాన్‌, ఆర్మేరియాలు మళ్లీ కొట్టుకుచస్తున్నాయి.. పక్కపక్కనే ఉన్నాయి కానీ పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత శత్రుత్వం వచ్చేసింది ఆ దేశాలకు.. రోజురోజుకీ ఉద్రిక్తతలు పెరిగిపోతున్నాయి.. రష్యా చొరవ తీసుకుని రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదిర్చింది కానీ.. ఆ ఒప్పందాన్ని గంటల పాటు కూడా పాటించలేదు.. ఆర్మేనియా సైనిక దళాలు అజర్‌బైజాన్‌పైకి క్షిపణి దాడులకు పాల్పడింది.. ఇలాగని అజర్‌బైజాన్‌ ఆరోపిస్తోంది.. తమ దేశంలోని రెండో అతి పెద్ద నగరం గాంజాలో ఆర్మేనియా జరిపిన క్షిపణి దాడుల్లో కనీసం తొమ్మిది మంది అమాయకపౌరులు మరణించారని అజర్‌బైజాన్‌ అంటోంది.. 30 మందికి తీవ్ర గాయాలయ్యాయని, భవంతులు ధ్వంసం అయ్యాయని ఆరోపిస్తోంది. మరో నగరం మింగచెవిర్‌లో కూడా క్షిపణి దాడులు జరిగాయట! నగొర్నో–కరాబాఖ్‌ అనే ప్రాంతంపై పట్టుకోసం ఈ రెండు దేశాలు తీవ్రంగా కొట్టుకుంటున్నాయి.. ఈ వివాదం ఇప్పటిదేం కాదు.. వందల ఏళ్ల నుంచి కొనసాగుతుంది కానీ.. పరిష్కారం దొరకడం లేదు.. నిజానికి నగొర్నో-కరాబాఖ్‌ ప్రాంతం భౌగోళికంగా అజర్‌బైజాన్‌లోనే ఉంది.. కాకపోతే ఆ ప్రాంతంపై ఆధిపత్యం మాత్రం ఆర్మేనియాది! అందుకే గొడవలు!