ఇండియాలో పెరుగుతున్న యూకే మ్యుటెంట్ వైరస్ కేసులు, రోగుల చికిత్సలో స్పెషల్ ప్రోటోకాల్

| Edited By: Pardhasaradhi Peri

Jan 05, 2021 | 1:42 PM

బ్రిటన్ నుంచి ఇండియాకు తిరిగి వస్తున్న వారి కారణంగా దేశంలో మ్యుటెంట్ కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి

ఇండియాలో పెరుగుతున్న యూకే మ్యుటెంట్ వైరస్ కేసులు, రోగుల చికిత్సలో స్పెషల్ ప్రోటోకాల్
Follow us on

Strain Virus:బ్రిటన్ నుంచి ఇండియాకు తిరిగి వస్తున్న వారి కారణంగా దేశంలో మ్యుటెంట్ కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. కొత్తగా మహారాష్ట్రలో 8, కేరళలో 6, ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాల్లో మూడేసి చొప్పున ఈ కేసులు నమోదయ్యాయి. మొత్తం 58 మందికి ఈ వైరస్ సోకిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఢిల్లీలో ముగ్గురికి ఈ వైరస్ సోకడంతో రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ..క్వారంటైన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఎప్పటికప్పుడు వీరి ఆరోగ్య పరిస్థితిని డా,క్టర్లు పర్యవేక్షిస్తున్నారని స్పష్టం చేసింది. ఇక యూకే నుంచి కేరళకు తిరిగి వచ్చిన వారిలో రెండేళ్ల చిన్నారితో సహా ఆరుగురు ఈ మ్యుటెంట్ వైరస్ కి గురైనట్టు గుర్తించారు. కొత్త కోవిడ్ 19 స్ట్రెయిన్ ప్రభావం ఎక్కువగా ఉందని కేరళ ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైలజ చెప్పారు. ముఖ్యంగా ఇది చిన్న పిల్లలకు కూడా రావడం ఆశ్చర్యంగా ఉందన్నారు. అయితే ఇది మరీ ప్రమాదకరం కాదని నిపుణులు పేర్కొంటున్నారని ఆమె అన్నారు.

కాగా యూకే నుంచి మహారాష్ట్రకు, ముఖ్యంగా ముంబైకి వచ్చిన 43 మందిలో 4 వేలమంది కోవిద్ 19 బారిన పడినట్టు తెలిసిందని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ తోప్ వెల్లడించారు. ఇతర రోగులను, వీరిని ట్రీట్ మెంట్ చేసే  ప్రత్యేకంగా ఉంటుందని, వీరిని వేరుగా ఐసోలేషన్ లో ఉంచడం  జరుగుతుందని ఆయన వివరించారు.

కర్ణాటకలో ముగ్గురిలో ఈ కొత్త స్ట్రెయిన్ లక్షణాలు కనిపించాయి. బ్రిటన్ నుంచి 34 మంది ఇటీవల ఈ రాష్ట్రానికి తిరిగి  వచ్చారు.

Also Read:

RRB NTPC 2nd Phase CBT exam: ఆర్ఆర్‌బి ఎన్టీపీసీ సెకండ్ పేజ్ పరీక్షల షెడ్యూల్ విడుదల..

ఫేస్ బుక్‌లో..లైవ్ స్ట్రీమ్ గా ముంబై యువకుని ఆత్మహత్యా యత్నం, ఐర్లండ్ నుంచి ధూలే వరకు.. సేవ్ అయ్యాడు

CM Yogi Adityanath: ఘజియాబాద్‌ బాధితులకు సాయాన్ని ప్రకటించిన సీఎం యోగీ… మృతుల కుటుంబాలకు తలా పదిలక్షలు…