Dharani: ఇరవై రోజుల్లో ధరణిలో మరిన్ని సేవలు.. పలు అంశాలపై నివేదిక అందించిన తహసీల్దార్లు.. ఏ ఏ సేవలు లభిస్తాయంటే..

Dharani:వ్యవసాయ భూములకు సంబంధించి (ధరణి) పోర్టల్ ద్వా రా మరిన్ని సేవలను ఇరవై రోజుల్లో ప్రభుత్వం ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్టుగా తెలిసింది.

Dharani: ఇరవై రోజుల్లో ధరణిలో మరిన్ని సేవలు..  పలు అంశాలపై నివేదిక అందించిన తహసీల్దార్లు.. ఏ ఏ సేవలు లభిస్తాయంటే..
Follow us

|

Updated on: Jan 09, 2021 | 3:50 PM

Dharani: వ్యవసాయ భూములకు సంబంధించి (ధరణి) పోర్టల్ ద్వా రా మరిన్ని సేవలను ఇరవై రోజుల్లో ప్రభుత్వం ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్టుగా తెలిసింది. దీనికి సంబంధించి త్వరలో మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. సమస్యలకు సంబంధించి ఇప్పటికే తహసీల్దార్‌లు ప్రభుత్వానికి నివేదికను అందించగా దానిపై తీసుకోవాల్సిన చర్యలను పునః పరిశీలించాలని సీసీఎల్ఏ అధికారులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సీఎం కేసీఆర్ సూచించినట్టు తెలిసింది. స్వయంగా జిల్లా కలెక్టర్లే ఈ బాధ్యతలను పర్యవేక్షించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. అయితే వ్యవసాయ భూముల విషయంలో నెలకొన్న కొద్దిపాటి సందిగ్ధతలను జిల్లా కలెక్టర్లు 2 నెలల వ్యవధిలో పరిష్కరిస్తారని సీఎం ప్రకటించారు. ధరణి పోర్టల్‌లో మరిన్ని ఆప్షన్లు పెట్టి, మరింత మెరుగుపరుస్తున్నట్లు సీఎం స్వయంగా వెల్లడించారు. ఈ నేపథ్యంలో ధరణిలో నెలకొన్న సుమారు 37కి పైగా సమస్యలను తహసీల్దార్‌లు ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక అందించారు. ఇవి క్లియర్ అయితే ధరణి ద్వారా జరిగే వ్యవసాయ రిజిస్ట్రేషన్‌లకు ఎలాంటి ఇబ్బంది ఉండదని తహసీల్దార్‌లు ఆ నివేదికలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో దీనిపై ఇరవై రోజుల్లో నిర్ణయం తీసుకోవడంతో పాటు మార్గదర్శకాలను జారీ చేసి ధరణి పోర్టల్ ద్వారా మరిన్ని సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కృతనిశ్చయంతో ప్రభుత్వం ముందుకెళుతోంది.

గతంలో రిజిస్ట్రేషన్‌లు జరిగి ఆన్‌లైన్‌లో మ్యుటేషన్ కానీ భూములు మళ్లీ అమ్ముకునేలా అవకాశం ఉండడంతో తహసీల్దార్‌లు కేసులు, సస్పెన్షలకు గురవుతున్నారు. ఆర్‌ఎస్‌ఆర్ విస్తీర్ణం వ్యత్యాసంతో పెండింగ్‌లో ఉన్న కేసులకు రికార్డులు సరిచేయలేదు. గతంలో ఏజీపీఏ చేసుకొని మరొకరికి రిజిస్ట్రేషన్ చేసేందుకు ఆప్షన్ ఇవ్వలేదు. ధరణి పోర్టల్‌లో విరాసత్ కేసుల్లో కుటుంబసభ్యులు కొందరు స్టేట్‌మెంట్‌లో వివాహం అయిపోయిన ఆడపిల్లల, ఇతర కుటుంబ సభ్యుల పేర్లు ఇవ్వకుండానేఏ దరఖాస్తు చేసుకున్నారు. ధరణి కంటే ముందు జరిగిన లావాదేవీలకు సంబంధించి డిజిటల్ సంతకాలకు తహసీల్దార్‌లకు అవకాశం లేదు. కొత్త ఖాతాలు, పాత ఖాతాలకు ఆధార్ అనుసంధానం జరిగినప్పటికీ ఈకెవైసీ రావడం లేదు. డూప్లికేట్ పట్టాదారు పాసు పుస్తకం ఇచ్చేందుకు అవకాశం లేదు. పాత పుస్తకాల్లో మొదటిపేజీ మాత్రమే వస్తోంది. గతంలో రిజిస్ట్రేషన్‌లు జరిగిన వాటిల్లో విస్తీర్ణాల్లో వ్యత్యాసం, పట్టాదారుల పేర్లు, వ్యక్తిగత ఇతర వివరాల్లో తేడాలు, విలీన ఖాతాలు, సర్వే నెంబర్‌లు నమోదుకానీ వివరాలు ధరణిలో మార్చేందుకు వీలు కావడం లేదు. సాదాబైనామాల మ్యుటేషన్‌ల విషయంలో డిజిటల్ సంతకాలున్న భూముల వివరాలే కనిపిస్తున్నాయి.

‘ధరణి’ పేరిట నకిలీ మొబైల్‌ యాప్‌, ఇద్దరు అరెస్ట్, రైతులూ తస్మాత్ జాగ్రత్త !

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో