పోలీస్ కేసు పెట్టిందని, భార్యను గొంతుకోసి చంపేశాడు

పోలీస్ కేసు పెట్టిందన్న కోపంతో కట్టుకున్న భార్యని అత్యంత దారుణంగా చంపేశాడు ఓ కసాయి భర్త.  కత్తితో కిరాతకంగా గొంతుకోసేశాడు.

పోలీస్ కేసు పెట్టిందని, భార్యను గొంతుకోసి చంపేశాడు
Follow us

|

Updated on: Sep 17, 2020 | 4:47 PM

పోలీస్ కేసు పెట్టిందన్న కోపంతో కట్టుకున్న భార్యని అత్యంత దారుణంగా చంపేశాడు ఓ కసాయి భర్త.  కత్తితో కిరాతకంగా గొంతుకోసేశాడు. ఈ  దారుణ ఘటన హైదరాబాద్ ఓల్డ్ సిటీలో పాతబస్తీలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే..  సయ్యద్ ఖాజామొహిద్దీన్, అస్మా బేగం(35) దంపతులు షాలిబండ ఏరియాలోని ఖాజీబండ అలీనగర్ లో నివశిస్తున్నారు. తొమ్మిదేళ్ల కిందట వీరికి వివాహమైంది.  ముగ్గురు పిల్లలతో కొద్దికాలం సాఫీగానే సాగిన కాపురంలో గొడవలు మొదలయ్యాయి. భర్త ఖాజామొహిద్దీన్ నిత్యం భార్యతో గొడవపడుతూ, వేధింపులకు గురిచేస్తుండేవాడు. ఇటీవల వేధింపులు మరింత ఎక్కువ అవ్వడంతో అస్మా  భర్తపై పోలీసులకు ఫిర్యాదు చచేసింది. దంపతులిద్దర్నీ స్టేషన్ కు పిలిపించిన పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. మరోమారు ఇద్దరి మధ్య గొడవ జరగడంతో భర్త ఘాతుకానికి తెగబడ్డాడు. గొంతుకోసి కిరాతకంగా చంపేశాడు. కత్తిపోట్లకు గురైన అస్మా పెద్దగా కేకలు వేయడంతో ఇరుగుపొరుగువారు వచ్చి ఆమెను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also Read :

ఒక్క రోజులో రేషన్ కార్డ్, జగన్ సర్కార్ నయా రికార్డ్

విశాఖ మణ్యంలో అంతు చిక్కని వ్యాధి, గిరిజనులు మృతి

బిగ్ బాస్ సీజన్ 4 : ఫస్ట్ ఎపిసోడ్ కు అదిరిపోయే రేటింగ్ !

Latest Articles
48 గంటల్లో ఎన్నికలు.. ఎమోషనల్ అయిన దిగ్విజయ్ సింగ్..!
48 గంటల్లో ఎన్నికలు.. ఎమోషనల్ అయిన దిగ్విజయ్ సింగ్..!
కోహ్లితోపాటు స్టార్ స్పోర్ట్స్‌పై విమర్శలు గుప్పించిన గవాస్కర్
కోహ్లితోపాటు స్టార్ స్పోర్ట్స్‌పై విమర్శలు గుప్పించిన గవాస్కర్
పవన్ జల్సా మూవీ హీరోయిన్ ఇంతగా మారిపోయిందేంటీ..?
పవన్ జల్సా మూవీ హీరోయిన్ ఇంతగా మారిపోయిందేంటీ..?
రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఆ ఐదు కిలోమీటర్ల పరిధి ఎత్తివేత..
రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఆ ఐదు కిలోమీటర్ల పరిధి ఎత్తివేత..
అబ్బాయిలతో ఫోన్‌ మట్లాడొద్దని మందలించినందుకు..అన్నను చంపిన చెల్లి
అబ్బాయిలతో ఫోన్‌ మట్లాడొద్దని మందలించినందుకు..అన్నను చంపిన చెల్లి
ఉర్ఫీ మ్యాజికల్ బట్టర్ ఫ్లై డ్రెస్ పై సమంత కామెంట్స్..
ఉర్ఫీ మ్యాజికల్ బట్టర్ ఫ్లై డ్రెస్ పై సమంత కామెంట్స్..
ఫిక్స్‌డ్ డిపాజిట్ నుంచి నెలవారీ వడ్డీని ఎలా పొందాలి ?
ఫిక్స్‌డ్ డిపాజిట్ నుంచి నెలవారీ వడ్డీని ఎలా పొందాలి ?
ఎంఐఎం - కాంగ్రెస్ కార్యకర్తల మధ్య కత్తుల దాడి.. ఒకరు మృతి
ఎంఐఎం - కాంగ్రెస్ కార్యకర్తల మధ్య కత్తుల దాడి.. ఒకరు మృతి
స్కూల్‌కు లేట్‌గా వచ్చిందని.. టీచర్‌పై ప్రిన్సిపాల్‌ దాడి
స్కూల్‌కు లేట్‌గా వచ్చిందని.. టీచర్‌పై ప్రిన్సిపాల్‌ దాడి
జియోలో వార్షిక రీఛార్జ్‌ ప్లాన్స్‌ ఎలా ఉన్నాయో తెలుసా..? హైస్పీడ్
జియోలో వార్షిక రీఛార్జ్‌ ప్లాన్స్‌ ఎలా ఉన్నాయో తెలుసా..? హైస్పీడ్