కుక్క “కోడ్” ఉల్లంఘించిందా..? “అరెస్ట్” చేసిన పోలీసులు

| Edited By:

Apr 30, 2019 | 7:14 PM

ఎన్నికల ప్రచార సమయం ముగిశాక ఆపై ఎవరు ప్రచారం చేసినా ఈసీ కొరడా ఝలిపించడం ఖాయం. అటువంటిది ఓ వైపు పోలింగ్ జరుగుతూ ఉంటే, బీజేపీకి ఓటేయాలంటూ వీధుల్లో ప్రచారం చేస్తే ఊరుకుంటారా? ఈసీ నిబంధనలను అమలు చేసే విషయంలో తమకు మనుషులైనా, జంతువులైనా ఒకటేనని ఆ పోలీసులు నిరూపించారు. విషయానికి వస్తే మహారాష్ట్రలోని నందుర్భార్‌లో బీజేపీకి ప్రచారం చేస్తోందన్న ఆరోపణలపై ఓ శునకాన్ని అరెస్ట్ చేశారు. ఆ ప్రాంతంలోని ఏక్‌నాథ్ మౌతీరాం అనే వ్యక్తికి ఓ […]

కుక్క కోడ్ ఉల్లంఘించిందా..? అరెస్ట్ చేసిన పోలీసులు
Follow us on

ఎన్నికల ప్రచార సమయం ముగిశాక ఆపై ఎవరు ప్రచారం చేసినా ఈసీ కొరడా ఝలిపించడం ఖాయం. అటువంటిది ఓ వైపు పోలింగ్ జరుగుతూ ఉంటే, బీజేపీకి ఓటేయాలంటూ వీధుల్లో ప్రచారం చేస్తే ఊరుకుంటారా? ఈసీ నిబంధనలను అమలు చేసే విషయంలో తమకు మనుషులైనా, జంతువులైనా ఒకటేనని ఆ పోలీసులు నిరూపించారు. విషయానికి వస్తే మహారాష్ట్రలోని నందుర్భార్‌లో బీజేపీకి ప్రచారం చేస్తోందన్న ఆరోపణలపై ఓ శునకాన్ని అరెస్ట్ చేశారు. ఆ ప్రాంతంలోని ఏక్‌నాథ్ మౌతీరాం అనే వ్యక్తికి ఓ పెంపుడు కుక్క ఉంది. అయితే దానిపై బీజేపీ అనుకూల స్టిక్కర్లను అతికించి, పోలింగ్ రోజు దాన్ని బయటకు తీసుకువచ్చారు. “మోడీకి ఓటేయండి, దేశాన్ని కాపాడండి” అన్న నినాదాన్ని కూడా దాని ఒంటిపై రాశాడు. ఇక రోడ్డుపై కుక్క ప్రచారాన్ని చూసిన ఇతర పార్టీల వారు.. ఆ కుక్కపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓటర్లను ప్రభావితం చేసేలా ఆ కుక్క చర్యలు ఉన్నాయని పోలీసులు తేల్చారు. దీంతో ఆ కుక్క యజమాని ఏక్‌నాథ్‌పై కేసు పెట్టి, దాన్ని కూడా స్టేషన్‌కు తరలించారు.