ముద్దు..ముద్దు మాటల టిక్‌‌టాక్ చిన్నారి కన్నుమూసింది!

‘టిక్‌టాక్’..యాప్‌పై సర్వత్రా విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ ఉద్యోగులు ఈ యాప్ ధ్యాసలో పడిపోయి..ఉద్యోగాలు పొగొట్టుకుంటున్నారు. మరికొందరు టిక్‌ టాక్ కోసం తిక్క టాస్క్‌లు చేస్తూ ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే. మరొవైపు ఈ యాప్ ఎప్పుడో విడిపోయినవాళ్లను కలుపుతోంది. కొందరి హిడెన్ టాలెంట్స్‌ను బహిర్గతం చేస్తోంది. ఈ యాప్‌ వల్ల ఫేమస్ అయిన సెలబ్రిటీస్ చాలా మందే ఉన్నారు. వారిలో ఒకరు 9 ఏళ్ల ఆరుణి కురుప్. కేరళకు చెందిన ఆ […]

ముద్దు..ముద్దు మాటల టిక్‌‌టాక్ చిన్నారి కన్నుమూసింది!
Follow us

|

Updated on: Jul 27, 2019 | 5:02 PM

‘టిక్‌టాక్’..యాప్‌పై సర్వత్రా విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ ఉద్యోగులు ఈ యాప్ ధ్యాసలో పడిపోయి..ఉద్యోగాలు పొగొట్టుకుంటున్నారు. మరికొందరు టిక్‌ టాక్ కోసం తిక్క టాస్క్‌లు చేస్తూ ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే. మరొవైపు ఈ యాప్ ఎప్పుడో విడిపోయినవాళ్లను కలుపుతోంది. కొందరి హిడెన్ టాలెంట్స్‌ను బహిర్గతం చేస్తోంది. ఈ యాప్‌ వల్ల ఫేమస్ అయిన సెలబ్రిటీస్ చాలా మందే ఉన్నారు. వారిలో ఒకరు 9 ఏళ్ల ఆరుణి కురుప్.

కేరళకు చెందిన ఆ చిన్నారి కూడా అలాగే స్టారైంది. ముద్దు ముద్దు మాటలతో నవ్విస్తూ అందరి ఇళ్లల్లో అమ్మాయిగా మారిపోయింది. కానీ ఇటీవలే ఈ బుజ్జిది ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్లిపోయింది. ఈ విషయం తెలిసినవారందరూ కన్నీళ్లు పెడుతోన్నారు. టిక్ టాక్‌ వీడియోలతో మలయాళీ ప్రజల మనసు దోచుకున్న ఆరుణి శుక్రవారం కన్నుమూసింది. ఈ విషయాన్ని కేరళకు చెందిన ఒక ప్రముఖ వెబ్‌సైట్ వెల్లడించింది. ఆరుణి మెదడుకు అంతుచిక్కని వ్యాధి సోకిందని, దీనివల్ల ఆమె కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుందోని తెలిపింది. ఇటీవల తీవ్ర జ్వరం, తలనొప్పితో అస్వస్థతకు గురైన ఆమెను త్రివేండ్రంలోని S.I.T. ఆస్పత్రికి తరలించారు. అయితే, వైద్యులు విశ్వప్రయత్నం చేసినప్పటికి చిన్నారిని కాపాడలేకపోయారు.

ఈ వార్త తెలియగానే మలయాళీ అభిమానులు సోషల్ మీడియా ద్వారా తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. చిన్నారి కుటుంబభానికి ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నారు.  ఆరుణి నాలుగో తరగతి చదువుతున్న ఆరుణిని తండ్రి 2018లో సౌదీ అరేబియాలో జరిగిన ప్రమాదంలో చనిపోయారు. చివరికి ఆరుణి కూడా తండ్రి వద్దకే వెళ్లిపోయి.. ఆమె తల్లి, కుటుంబికులను కన్నీటి సంద్రంలో ముంచింది.