కాశ్మీర్ పైనా కన్నేసిన ఆ ఉగ్రవాది హతం

కాశ్మీర్ పైనా కన్నేసిన ఆ ఉగ్రవాది హతం

దాదాపు తొమ్మిదేళ్ల క్రితం లండన్ బ్రిడ్జిపై ఇద్దరు వ్యక్తులను కత్తితో పొడిచి.చంపి.. . మరో ముగ్గురిని గాయపరిచిన ఉగ్రవాది ఉస్మాన్ ఖాన్ బ్రిటిష్ పోలీసుల కాల్పుల్లో మరణించాడు. 2010 డిసెంబరులో అప్పటికి 19 ఏళ్ళ వాడైన ఉస్మాన్.. పైప్ బాంబులు తయారు చేయడంలో సిధ్ధహస్తుడు. ఇతగాడు లండన్ స్టాక్ ఎక్స్ ఛేంజిని పేల్చివేయడానికి కూడా కుట్ర పన్నాడట. బ్రిటిష్ పోలీసులు అప్పట్లోనే ఇతడ్ని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. 2012 లో ఉస్మాన్ ఖాన్ కు ఎనిమిదేళ్ల […]

Anil kumar poka

|

Dec 01, 2019 | 12:58 PM

దాదాపు తొమ్మిదేళ్ల క్రితం లండన్ బ్రిడ్జిపై ఇద్దరు వ్యక్తులను కత్తితో పొడిచి.చంపి.. . మరో ముగ్గురిని గాయపరిచిన ఉగ్రవాది ఉస్మాన్ ఖాన్ బ్రిటిష్ పోలీసుల కాల్పుల్లో మరణించాడు. 2010 డిసెంబరులో అప్పటికి 19 ఏళ్ళ వాడైన ఉస్మాన్.. పైప్ బాంబులు తయారు చేయడంలో సిధ్ధహస్తుడు. ఇతగాడు లండన్ స్టాక్ ఎక్స్ ఛేంజిని పేల్చివేయడానికి కూడా కుట్ర పన్నాడట. బ్రిటిష్ పోలీసులు అప్పట్లోనే ఇతడ్ని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. 2012 లో ఉస్మాన్ ఖాన్ కు ఎనిమిదేళ్ల జైలుశిక్ష పడింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద శిబిరాలను విజిట్ చేసి.. కాశ్మీర్ లో దాడులు జరపడానికి, టెర్రరిస్టులకు శిక్షణ ఇవ్వడానికి కూడా ఇతగాడు పథకం రచించాడని తెలిసింది. 2018 వరకు లండన్ లో జైలుశిక్ష అనుభవించిన ఉస్మాన్.. గత డిసెంబరులో పెరోల్ పై విడుదలయ్యాడు.

అసలు పెరోల్ బోర్డు అసెస్ మెంట్ లేకుండానే ఖాన్ ఎలా విడుదలయ్యాడన్నది మిస్టరీ.. ప్రస్తుతం 28 ఏళ్ళ వాడైన ఉస్మాన్ గత శుక్రవారం ఫేక్ సూసైడ్ సూట్ ధరించి.. పెద్ద కిచెన్ కత్తులతో లండన్ బ్రిడ్జి వద్ద గల ఖైదీల పునరావాస కేంద్రం సమీపంలో భయోత్పాతం సృష్టించాడు. స్థానికులు ఇతడ్ని పట్టుకుని పోలీసులకు అప్పగించే క్రమంలో పెనుగులాట జరిగి ఉస్మాన్ కింద పడిపోయాడు. అప్పుడే అక్కడికి చేరుకున్న ముగ్గురు పోలీసు అధికారులు రెండు సార్లు కాల్పులు జరపడంతో ఉస్మాన్ అక్కడికక్కడే మరణించాడు.ఉస్మాన్ బ్రిటిషర్ అయినప్పటికీ.. ఇతని కుటుంబం పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి వచ్చింది. ఉగ్రవాద సంస్థ అల్-ఖైదా ప్రభావంతో ఉస్మాన్ కూడా కరడు గట్టిన టెర్రరిస్టుగా మారాడు. ఇలాంటి ఉగ్రవాదులను తాము ఎప్పటికీ క్షమించే ప్రసక్తే లేదని, ఉగ్రవాదం అంతానికి తాము కట్టుబడి ఉన్నామని బ్రిటిష్ ప్రధాని బోరిస్ జాన్సన్ అంటున్నారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu