విచిత్రం : ఉరుములు, మెరుపులు లేకుండానే ప‌డ్డ‌ పిడుగు

|

Aug 18, 2020 | 5:34 PM

ఆకాశం ద‌ట్ట‌మైన మేఘాల‌తో క‌మ్ముకుని ఉండి, జోరు వాన ప‌డుతూ, మెరుపులు మెరుస్తూ ఉండ‌గా పిడుగులు ప‌డ‌టం మ‌నం ఇప్ప‌టివ‌ర‌కు చూశాం..విన్నాం.

విచిత్రం : ఉరుములు, మెరుపులు లేకుండానే ప‌డ్డ‌ పిడుగు
Follow us on

ఆకాశం ద‌ట్ట‌మైన మేఘాల‌తో క‌మ్ముకుని ఉండి, జోరు వాన ప‌డుతూ, మెరుపులు మెరుస్తూ ఉండ‌గా పిడుగులు ప‌డ‌టం మ‌నం ఇప్ప‌టివ‌ర‌కు చూశాం..విన్నాం. ఈ మ‌ధ్య పిడుగుల‌కి సంబంధించి కూడా ఫ‌లానా చోటా ప‌డే అవ‌కాశం ఉంద‌ని అలెర్ట్స్ వ‌స్తున్నాయి. అది వేరే విష‌యం. కానీ ఆకాశంలో మేఘాలు లేవు, వ‌ర్షం వ‌చ్చే సింట‌మ్స్ లేవు, గాలి వాన జాడే లేదు…అయినా కానీ అనూహ్యంగా పిడుగు ప‌డింది. ఇది మీకు నమ్మ‌శక్యంగా అనిపించ‌క‌పోవచ్చు. కావాలంటే ఈ వీడియో చూడండి.

చూశారా..పిడుగు ఒక్క‌సారిగా వచ్చి ఎత్తైన చెట్టును ఎలా తాకిందో. ఇంకా న‌యం అక్క‌డ ప్రాణ న‌ష్టం, ఆస్థి న‌ష్టం సంభ‌వించ‌లేదు. ఎవ‌రూ చూడ‌క‌పోతే ఆ మిస్టరీ ఏంటో ఎవరికీ అర్థ‌మ‌య్యేది కాదు. ప్లోరీడాలోని తంపా ప్రాంతానికి చెందిన మోరే అనే వ్య‌క్తి త‌న కార్ పార్క్ చేసి ఉంచాడు. పెద్ద శ‌బ్దం వ‌చ్చిన అనంత‌రం..ఏంటో అని ప‌రీక్షించ‌గా అత‌డికి పిడుగు ప‌డ్డ‌ట్లు అర్థ‌మ‌య్యింది. అయితే అక్క‌డి వాతావ‌ర‌ణం చూసి పిడుగు ఏంటి అంటే ఎవ‌రూ న‌మ్మ‌రు. అందుకే అత‌డు కారు కెమెరాలో రికార్డ‌యిన ఫుటేజ్‌ చెక్ చేశాడు. అక్క‌డ పిడుగు ప‌డ్డ విష‌యం స్ప‌ష్టంగా అర్థ‌మైంది. ఆ వీడియో ఇప్పుడు వైర‌ల్‌గా మారింది. కాగా ప్ర‌శాంత‌మైన వాతావ‌ర‌ణం ఉండ‌గా పిడుగు ఎలా ప‌డిందో ఎవ‌రికీ అర్థం కావ‌డం లేదు. ఎంతైనా 2020 మ‌హ‌త్యం గురూ !