నేను డిల్లాన్‌..సౌతాఫ్రికా నుంచి చిరుతతో ఫేస్‌ టు ఫేస్‌..

చిరుతను చూడగానే అమ్మో ఇక మన పని అయిపోయినట్లే అనుకొని గజగజలాడిపోతాం. అదే దగ్గరికి వస్తే ఇంకేముంది అక్కడి నుంచి పరుగులు తీస్తాం.  కానీ ఓ వైల్డ్‌ ఫొటోగ్రాఫర్‌ ఏ మాత్రం బెదరలేదు. ఓ చిరుత పిల్ల తన షూ దగ్గరకు వచ్చి చూస్తున్నా కదలకుండా అలానే నిల్చుండిపోయాడు. ఐతే కాసేపు అక్కడే ఉండి షూను పరిశీలించి వెళ్లిపోయింది ఆ చిరుత పిల్ల. ఈ ఘటన సౌతాఫ్రికాలోని సబీ సాండ్స్‌ నేచర్‌ రిజర్వ్‌లో జరిగింది. డిల్లాన్‌ నెల్సన్‌ […]

నేను డిల్లాన్‌..సౌతాఫ్రికా నుంచి చిరుతతో ఫేస్‌ టు ఫేస్‌..

Updated on: Dec 11, 2019 | 11:08 AM

చిరుతను చూడగానే అమ్మో ఇక మన పని అయిపోయినట్లే అనుకొని గజగజలాడిపోతాం. అదే దగ్గరికి వస్తే ఇంకేముంది అక్కడి నుంచి పరుగులు తీస్తాం.  కానీ ఓ వైల్డ్‌ ఫొటోగ్రాఫర్‌ ఏ మాత్రం బెదరలేదు. ఓ చిరుత పిల్ల తన షూ దగ్గరకు వచ్చి చూస్తున్నా కదలకుండా అలానే నిల్చుండిపోయాడు. ఐతే కాసేపు అక్కడే ఉండి షూను పరిశీలించి వెళ్లిపోయింది ఆ చిరుత పిల్ల. ఈ ఘటన సౌతాఫ్రికాలోని సబీ సాండ్స్‌ నేచర్‌ రిజర్వ్‌లో జరిగింది.

డిల్లాన్‌ నెల్సన్‌ నేచర్‌ గైడ్‌గా పనిచేస్తూనే వైల్డ్‌లైఫ్‌ ఫొటోగ్రఫీ చేస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం ఫారెస్ట్‌ అందాలను, అందులోని జంతువులను క్లిక్‌మనిపించేందుకు వెళ్లాడు. అక్కడ తన పిల్లలతో కలిసి ఉన్న చిరుత అతని కంటబడింది. దీంతో వాటిని ఫొటో తీసేందుకు ప్రయత్నించగా ఓ చిరుత పిల్ల అతని దగ్గరకొచ్చింది. ఐతే తన షూను చూసి గడ్డి పరకలు నములుతూ కొద్దిసేపు ఉండి వెళ్లిపోయింది. దీంతో బతుకుజీవుడా అంటూ బయటపడ్డాడు ఆ ఫొటోగ్రాఫర్‌. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. దీనిపై భిన్నంగా కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.