కుబేర పెరుమాళ్ ఆలయం… తిరువణ్ణామలై!

భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో ఉన్న తిరువణ్ణామలై ఒక పుణ్య క్షేత్రం మరియు జిల్లా ప్రధాన కేంద్రం. అన్నామలై కొండ దిగువ ప్రాంతంలో ఉన్న అన్నామలైయర్ గుడి తిరువణ్ణామలైలోనే ఉంది. ఈ గుడి తమిళనాడులోని శైవ క్షేత్రాలలో ఒక గొప్ప క్షేత్రం. తిరువణ్ణామలైతో చాలా యోగులకి సిద్ధులకి సంబంధం ఉంది. 20వ శతాబ్దపు గురువులలో ఒకరైన రమణ మహర్షి కూడా అరుణాచల శిఖరం మీద ఉండేవారు. అందుచేత, తిరువణ్ణామలై ఇప్పుడు ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక క్షేత్రం. తెలుగువారు అరుణాచలంగా […]

కుబేర పెరుమాళ్ ఆలయం... తిరువణ్ణామలై!
Follow us

| Edited By:

Updated on: Oct 20, 2019 | 5:37 PM

భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో ఉన్న తిరువణ్ణామలై ఒక పుణ్య క్షేత్రం మరియు జిల్లా ప్రధాన కేంద్రం. అన్నామలై కొండ దిగువ ప్రాంతంలో ఉన్న అన్నామలైయర్ గుడి తిరువణ్ణామలైలోనే ఉంది. ఈ గుడి తమిళనాడులోని శైవ క్షేత్రాలలో ఒక గొప్ప క్షేత్రం. తిరువణ్ణామలైతో చాలా యోగులకి సిద్ధులకి సంబంధం ఉంది. 20వ శతాబ్దపు గురువులలో ఒకరైన రమణ మహర్షి కూడా అరుణాచల శిఖరం మీద ఉండేవారు. అందుచేత, తిరువణ్ణామలై ఇప్పుడు ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక క్షేత్రం. తెలుగువారు అరుణాచలంగా పిలిచే ఈ తిరువణ్ణామలై పేరు తలిస్తేనే ముక్తిని చేకూరుస్తుందంటారు. ఈ క్షేత్రాన్ని భక్తితో దర్శించి శ్రధ్ధతో స్వామిని పూజిస్తే పూజించినవారు మాత్రమేకాక వారి తర్వాత ఇరవై ఒక్క తరాలవారుకూడా ముక్తిని పొందుతారని పురాణాల్లో చెప్పబడింది. ఈ స్ధలాన్ని వశిష్టుడు, వ్యాసుడు, అగస్త్యుడు మొదలగు మహర్షులేకాక మరెందరో ప్రసిధ్ధులు, యోగులు, స్వామిని దర్శించి పూజించారు. అనేక కవిపుంగవులు స్వామి మహిమలగురించి స్తుతిగానాలు చేశారు.

తమిళనాడులో ఆలయాలు

తమిళనాడులో ఆలయాలు అతి విశాలంగా, అద్భుత శిల్ప సంపదతో అలరారుతుంటాయి. దీనికి కారణం ఇక్కడి రాజుల, ముఖ్యంగా, అనేక ఆలయాల నిర్మాణానికి కారకులయిన చోళ రాజుల శ్రధ్ధా భక్తులే కావచ్చు.

తిరువణ్ణామలైలోని కుబేర పెరుమాళ్ ఆలయం

ఈ ఆలయం నిర్మాణాన్ని రాజర్షి సిద్ధార్థ పీఠం మరియు పద్మావతి తాయార్ ట్రస్ట్ ఆద్వర్యంలో నిర్మింపబడినది. ఇది గిరివాలం రహదారికి ఉత్తరాన కిలో  మీటర్ దూరంలో ఉంది మరియు దీనిని 2002 లో నిర్మించారు. తిరువణ్ణామలైలో ప్రధానంగా విష్ణువుకు అంకితం చేసిన కుబేర పెరుమాళ్ ఆలయంలో శివుడు, బ్రహ్మ విగ్రహాలు ఉన్నాయి. కానీ కుబేర పెరుమాళ్ ఆలయానికి ముఖ్య దేవుడు అరుణాచలేశ్వరుడు. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఈ మందిరాన్ని సందర్శిస్తారు.

64 అడుగుల ఎత్తైన విగ్రహం

ఈ ఆలయం యొక్క విశిష్టత శ్రీదేవి మరియు భూదేవిలతో శ్రీ మహా విష్ణువు యొక్క 64 అడుగుల ఎత్తైన విగ్రహం ఉండటం. కుబేర పెరుమాళ్ ఆలయం, మొదట తమిళనాడులోని తిరుపతి ఆలయ శైలిలో నిర్మించబడింది, ఇది దక్షిణ భారత వాస్తుశిల్పం యొక్క అద్భుత నిర్మాణం.

అరుదైన”శివ శక్తి ఐక్య స్వరూప దర్శనం

అగస్త్య మహర్షి ఆశ్రమం వద్ద నుండి అరుదైన”శివ శక్తి ఐక్య స్వరూప దర్శనం” లభిస్తుంది. అధికార నంది దాటిన తరువాత వచ్చే మట్టి దారిలో ఒక కిలోమీటరు దూరం ఎడమపక్క లోపలికి నడిస్తే “శ్రీ కుబేర పెరుమాళ్ కోవెల: ఉంటుంది. స్వర్ణమయ శ్రీ వేంకటేశ పెరుమాళ్ నిలువెత్తు విగ్రహం నయన మనోహరంగా ఉంటుంది. ఇంకా నారసింహ, దేవి ఉపాలయాలు ఉన్నాయి.

రథం ఆకారంలో విమానం

తిరువణ్ణామలైలోని కుబేర పెరుమాల్ ఆలయం యొక్క మరో అద్భుతమైన నిర్మాణం రథ ఆకారంలో ఉన్న విమానం(గుడి గోపురం), ఇది భారతదేశంలో మరెక్కడా కనిపించదు. కుబేర పెరుమాళ్ ఆలయం కామధేను, విష్ణు కల్పవృక్ష మరియు విశ్వక్సేన ఆలయాలకు ప్రసిద్ధి చెందింది. కాబట్టి, కుబేర పెరుమాళ్ ఆలయంలో త్రిమూర్తులను చూడవచ్చు.

ప్రముఖ ఉత్సవాలు

మతపరంగా మొగ్గు చూపే వారికి ఇది ఒక గొప్ప ప్రదేశం. కుబేర పెరుమాళ్ ఆలయంలో జరిగే ప్రధాన ఉత్సవాలు వైకుంఠ ఏకాదశి, విష్ణు పండుగలు. ఈ పండుగలను తిరుపతిలో కూడా జరుపుకుంటారు. ఈ క్షేత్రంలో ఏడాదికి నాలుగు సార్లు బ్రహ్మోత్సవాలు జరుపుతారు. తమిళ నెల కార్తీకంలో (నవంబరు/డిసెంబరు) జరిగే బ్రహ్మోత్సవాలు ప్రసిద్ధి చెందాయి. పది రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలు కార్తీక దీపం రోజుతో ముగుస్తాయి. ఈ ఆలయం ఉదయం 6.30 నుండి 10గంటల వరకు తెరచి ఉంటుంది.

ఎక్కడ బస చేయాలి?

ఇక్కడ కుబేర పెరుమాళ్ కోవెలను సందర్శించడానికి వచ్చే స్త్రీ మరియు పురుషులు ప్రయోజనాల కొరకు అనేక హోటళ్ళు మరియు సంప్రదాయ రిసార్ట్స్ ఉన్నాయి. అలాగే ఆధ్యాత్మిక పరంగా వచ్చే భక్తుల కొరకు తిరువణ్ణామలైలోని కుబేర పెరుమాల్ ఆలయంలో యాత్రికులకు అవసరమైన అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశారు.

ఎలా వెళ్ళాలి?

తిరువణ్ణామలై రైల్వే స్టేషన్ సమీప రైల్వేష్టేషన్. ఇక్కడి నుండి టాక్సీ ద్వారా పెరుమాళ్ ఆలయానికి చేరుకోవచ్చు. గిరివాలం రోడ్ ఈ ప్రదేశానికి చాలా దగ్గరగా ఉంటుంది. అలాగే బస్సు మార్గం ద్వారా కూడా చేరుకోవచ్చు.

Latest Articles
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి
కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో
కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో
ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..
ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..
జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌
జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ