త్వరలోనే కొణిదెల వారింట పెళ్లి సందడి..ఎంగేజ్‌మెంట్ డేట్ ఫిక్స్..

మెగా డాటర్ నిహారిక కొణిదల తనకు కాబోయే వాడిని ఎప్పుడైతే పరిచయం చేసిందో..ఇక అప్పటి నుంచి ఆమె పెళ్లి వార్త వైరల్‌గా మారింది....

త్వరలోనే కొణిదెల వారింట పెళ్లి సందడి..ఎంగేజ్‌మెంట్ డేట్ ఫిక్స్..
Follow us

|

Updated on: Jul 29, 2020 | 2:02 PM

మెగా డాటర్ నిహారిక కొణిదెల తనకు కాబోయే వాడిని ఎప్పుడైతే పరిచయం చేసిందో..ఇక అప్పటి నుంచి ఆమె పెళ్లి వార్త వైరల్‌గా మారింది. గుంటూరు రేంజ్ ఐజీ ప్రభాకర్ రావు కుమారుడు జొన్నలగడ్డ వెంకట చైతన్యను నిహారిక కొణిదెల పెళ్లి చేసుకోబోతున్నారు. చైతన్య కుటుంబంతో మెగా ఫ్యామిలీకి ఎప్పటి నుంచో పరిచయం ఉండటం.. చిరంజీవి తండ్రి కొణిదెల వెంకటరావు, చైతన్య తాతయ్య గుణ వెంకటరత్నం ప్రాణ స్నేహితులు కావడంతో ఈ సంబంధం సెట్ అయినట్టు తెలుస్తోంది.

నిహారిక ఎంగేజ్‌మెంట్ కార్యక్రమాన్ని కేవలం కుటుంబ వేడుకగా చేస్తున్నామని ఇప్పటికే నాగబాబు స్పష్టత ఇచ్చారు. వీరి వివాహం ఈ ఏడాదిలోనే జరగనుందని నాగబాబు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ప్రస్తుత పరిస్థితులను బేరీజు వేసుకొని.. లాక్‌డౌన్ నిబంధనలకు అనుగుణంగా నిహారిక ఎంగేజ్‌మెంట్ వేడుకను నిర్వహిస్తామని స్వయంగా ఆయనే వెల్లడించారు. నాగబాబు తనయుడు, హీరో వరుణ్ తేజ్ నిహారిక ఎంగేజ్‌మెంట్ జరగనుందని తెలిపారు. ఇంకా ఎంగేజ్‌మెంట్‌ కోసం ఆహ్వానితుల జాబితాను ఫైనలైజ్ చేయలేదని వారు కొద్ది రోజుల క్రితం వెల్లడించారు.