వైరల్‌ వీడియో: వివాహ వేదికపైకి వధువు వినూత్న ఎంట్రీ..!

కేరళ రాష్ట్రంలోని కన్నూర్‌లోని సిఆర్ ఆడిటోరియంలో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. వివాహ వేదికపై వరుడిని ఆశ్చర్యపరచాలనుకున్న ఓ వధువు.. వినూత్న ఎంట్రీతో అతిథులను సైతం మైమరపించింది. కల్యాణమండపంలోకి సంప్రదాయ దుస్తుల్లో నృత్యం చేసుకుంటూ వచ్చి అందరి చూపుల్ని ఆకర్షించింది. ప్రస్తుతం ఆమె నృత్యానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కేరళలోని కన్నూర్‌లో జరిగిన ఓ వివాహ వేడుకలో ఈ సన్నివేశం చోటుచేసుకుంది. తోడిపెళ్లికూతుర్లతో కలిసి అంజలి అనే వధువు వినూత్న ఎంట్రీతో వివాహ వేదికపై […]

వైరల్‌ వీడియో: వివాహ వేదికపైకి వధువు వినూత్న ఎంట్రీ..!

కేరళ రాష్ట్రంలోని కన్నూర్‌లోని సిఆర్ ఆడిటోరియంలో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. వివాహ వేదికపై వరుడిని ఆశ్చర్యపరచాలనుకున్న ఓ వధువు.. వినూత్న ఎంట్రీతో అతిథులను సైతం మైమరపించింది. కల్యాణమండపంలోకి సంప్రదాయ దుస్తుల్లో నృత్యం చేసుకుంటూ వచ్చి అందరి చూపుల్ని ఆకర్షించింది. ప్రస్తుతం ఆమె నృత్యానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కేరళలోని కన్నూర్‌లో జరిగిన ఓ వివాహ వేడుకలో ఈ సన్నివేశం చోటుచేసుకుంది.

తోడిపెళ్లికూతుర్లతో కలిసి అంజలి అనే వధువు వినూత్న ఎంట్రీతో వివాహ వేదికపై తనకు కాబోయే భర్తను ఆశ్చర్యపరచాలనుకుంది. ఈ క్రమంలో తన బృందంతో ‘మలైయూరు’ అనే మలయాళ పాటకు నృత్యం చేసుకుంటూ మండపంలోకి వచ్చింది. దీంతో వివాహానికి వచ్చిన అతిథులందరూ ఒక్కసారిగా ఆకర్షితులయ్యారు. దీనికి సంబంధించిన వీడియో కొందరు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేయగా వైరల్‌గా మారింది. ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసిన కొద్ది క్షణాల్లోనే ఫేస్‌బుక్‌లో 76వేల పైగా, ట్విటర్‌లో 50వేలకు పైగా నెటిజన్లు దీన్ని వీక్షించారు. ‘డ్యాన్స్‌ చాలా బాగుంది’ అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేశారు.

[svt-event date=”04/02/2020,11:54PM” class=”svt-cd-green” ]

[/svt-event]

Published On - 5:05 am, Wed, 5 February 20

Click on your DTH Provider to Add TV9 Telugu