కొత్త గవర్నర్‌తో కేసీఆర్‌కు చిక్కులు తప్పవా?

ఎవరు అవునన్నా, కాదన్నా మోదీ-అమిత్ షా ద్వయం దేశంపై పూర్తి పట్టు సాధించారు. ఇప్పుడు వారు ఏది చేస్తే అదే శాసనం అనే దాంట్లో అతిశయోక్తి ఏమి లేదు. పూర్తి మోజార్టీతో అధికారంలోకి రావడం, అందుకు మోదీ చరిష్మానే కారణం అవ్వడం, పక్కన అమిత్ షా రూపంలో ఎత్తులకు పైఎత్తులు వేయడానికి పూర్తి సహకారం అభిస్తుండటంతో మోదీ దృఢంగా ముందుకు వెళ్తున్నారు. సామ, ధాన, భేద, దండోపాయాలను ఉపయోగించి దేశంలోనే కాకుండా ప్రతి రాష్ట్రంలో బీజేపీ జెండా […]

కొత్త గవర్నర్‌తో కేసీఆర్‌కు చిక్కులు తప్పవా?
KCR Will Face Problems With New Governor?
Follow us

|

Updated on: Sep 02, 2019 | 2:46 PM

ఎవరు అవునన్నా, కాదన్నా మోదీ-అమిత్ షా ద్వయం దేశంపై పూర్తి పట్టు సాధించారు. ఇప్పుడు వారు ఏది చేస్తే అదే శాసనం అనే దాంట్లో అతిశయోక్తి ఏమి లేదు. పూర్తి మోజార్టీతో అధికారంలోకి రావడం, అందుకు మోదీ చరిష్మానే కారణం అవ్వడం, పక్కన అమిత్ షా రూపంలో ఎత్తులకు పైఎత్తులు వేయడానికి పూర్తి సహకారం అభిస్తుండటంతో మోదీ దృఢంగా ముందుకు వెళ్తున్నారు. సామ, ధాన, భేద, దండోపాయాలను ఉపయోగించి దేశంలోనే కాకుండా ప్రతి రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగరవెయ్యడానికి పావులు కదుపుతున్నారు. అందుకు తగ్గట్టుగానే వారి నిర్ణయాలు ఉంటున్నాయి.

రాజకీయ ప్రత్యర్థులకు ఊహించని విధంగా వ్యూహాలను అమలుపర్చడం బీజేపీ అగ్రనేతలకు అలవాటే. తాజాగా తెలంగాణ రాష్ట్రానికి మహిళా గవర్నర్ ను ఎంపిక చేస్తూ తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. దీనికి పలు కారణాలు కనిపిస్తున్నాయి.  తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటైన తొలి ప్రభుత్వంలోనూ.. తాజాగా రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కేసీఆర్ సర్కారులోనూ మంత్రిమండలిలో మహిళకు చోటు దక్కని సంగతి తెలిసిందే. తెలంగాణ ఉద్యమ వేళలో పురుషులతో సమానంగా కోట్లాడిన మహిళలకు.. తెలంగాణ కేబినెట్ లో చోటు లేకపోవటంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తినా.. కేసీఆర్ వెనక్కి తగ్గింది లేదు. మహిళకుచోటు ఇచ్చింది లేదు.

రానున్న కొద్ది రోజుల్లో మంత్రివర్గాన్ని విస్తరించే దిశగా అడుగులు వేస్తున్న కేసీఆర్.. ఇద్దరు మహిళలకు మంత్రి పదవులు ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఇలాంటి వేళ.. వారికంటే ముందుగా తెలంగాణ రాష్ట్రానికి ఒక మహిళను గవర్నర్ గా ఎంపిక చేయటం ద్వారా.. కేసీఆర్ కంటే ఎక్కువగా మోడీషానే ప్రాధాన్యత ఇచ్చారన్న పేరును తాజా నిర్ణయంతో సొంతం చేసుకున్నట్లే. అంతేకాదు మొదట్నుంచి కూడా కేసీఆర్ మోదీ ప్రభుత్వంతో అంటీముంటనట్టగానే ఉంటున్నారు. తటస్థంగా ఉండేవారిని కలుపుకుపోయి ఫెడరల్ ప్రెంట్ ఏర్పాటు చేయాలని విశ్వప్రయత్నాలు చేశారు. కానీ అవన్నీ బెడిసికొట్టాయి. ఈ నేపథ్యంలో మోదీకి, కేసీఆర్‌కి మధ్య గ్యాప్ నడుస్తుందని బాహటంగానే తెలిసిపోతుంది. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎలక్షన్స్‌లో తెలంగాణకు 4 ఎంపీ సీట్లు రావడంతో బీజేపీ నూతనోత్సాహంతో ముందడుగు వేస్తోంది. ఆ పార్టీలో చేరికలు కూడా బానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో నెక్ట్స్ ఎలక్షన్స్‌ నాటికి తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. ఇప్పటివరకు ఉన్న గవర్నర్ నరసింహన్ ఇరు వర్గాలను నొప్పించకుండా తనపని తాను చేసుకుపోయారు. రాజ్యాంగపరంగా సంతకాల విషయంలో కూడా ప్రభుత్వానికి చిక్కులు కలగలేదు. కానీ రాష్ట్రానికి కొత్త గవర్నర్ రానున్న నేపథ్యంలో ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పేలా లేవు. అసలే  తమిళ్‌పై సౌందర్ రాజన్ పార్టీకి వీరవీధేయురాలు కావడం కూడా టీఆర్‌ఎస్ పార్టీకి తలనొప్పి కలిగించే అంశం. సో లెట్స్ వెయిట్ అండ్ సీ.