‘కిమ్…..నన్ను క్షమించు…’…..కాన్యే వెస్ట్ భావోద్వేగ పోస్ట్

అమెరికన్ ర్యాపర్ కాన్యే వెస్ట్ తన భార్య కిమ్ కర్దాషియన్ కి క్షమాపణలు చెబుతూ ట్వీట్ చేశాడు. తమ ప్రైవేటు (వ్యక్తిగత) వ్యవహారాలను పబ్లిక్ గా బయటపెట్టినందుకు అపాలజీ చెబుతున్నానన్నాడు.' తననుఆమె ఎలా కాపాడుకుంటూ..

కిమ్.....నన్ను క్షమించు........కాన్యే వెస్ట్ భావోద్వేగ పోస్ట్

Edited By:

Updated on: Jul 26, 2020 | 3:09 PM

అమెరికన్ ర్యాపర్ కాన్యే వెస్ట్ తన భార్య కిమ్ కర్దాషియన్ కి క్షమాపణలు చెబుతూ ట్వీట్ చేశాడు. తమ ప్రైవేటు (వ్యక్తిగత) వ్యవహారాలను పబ్లిక్ గా బయటపెట్టినందుకు అపాలజీ చెబుతున్నానన్నాడు.’ తననుఆమె ఎలా కాపాడుకుంటూ  వచ్చిందో తను ఆమెను అలా  కాపాడలేకపోయానని, ఇందుకు చింతిస్తున్నానని’ తెలిపాడు. ‘నిన్ను బాధ పెట్టానని నాకు తెలుసు..ప్లీజ్..నన్ను క్షమించు’.. అని పేర్కొన్నాడు. ఈ ట్వీట్ తో బాటు తన దివంగత తల్లి పేరిట రూపొందించిన కొత్త ఆల్బమ్ టీజర్ ని కూడా కాన్యే వెస్ట్ జత చేశాడు.

ఇక మళ్ళీ అమెరికా అధ్యక్ష పదవికి జరగనున్న ఎన్నికలపై కాన్యే దృష్టి పెట్టాడు. తన మెంటల్ హెల్త్ పై ఆందోళన వ్యక్తం చేసినవారికి కృతజ్ఞతలు తెలిపిన ఈ ర్యాపర్.. ఎన్నికల్లో డెమొక్రాట్ అభ్యర్థి జో బిడెన్ ని ఓడిస్తానని ప్రకటించాడు. అయితే ప్రెసిడెంట్ ట్రంప్ గురించి మాత్రం ప్రస్తావించలేదు.

 

Loading...
Unable to load recommendations.
Follow Us