నెల్లూరు కోర్టు సంచలన తీర్పు..కామాంధుడు జీవితాంతం జైలులోనే

నెల్లూరు ఒకటో అడిషనల్ డిస్ట్రిక్ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. మైనర్ బాలికపై అత్యాచారం చేసిన నిందితుడికి జీవిత ఖైదు విధించింది. వివరాల్లోకి వెళ్తే.. కడప జిల్లాకు చెందిన 11 ఏళ్ల బాలిక సెలవుల్లో తన అమ్మమ్మ వాళ్ల ఇంట్లో కొన్ని రోజులు ఉండేందుకు వచ్చింది. ఆమె తనకు ఇషమైన వాటిని కొనుక్కునేందుకు ప్రతి రోజు దగ్గర్లో ఉన్న కిరాణ షాపుకు రావడాన్ని గమనించాడు ముత్తుకూరు ఎమ్మార్వో కాలనీకి చెందిన సాయికృష్ణ. చాకెట్లు, బిస్కెట్లు కొనిపించి […]

నెల్లూరు కోర్టు సంచలన తీర్పు..కామాంధుడు జీవితాంతం జైలులోనే

Updated on: Nov 30, 2019 | 1:36 PM

నెల్లూరు ఒకటో అడిషనల్ డిస్ట్రిక్ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. మైనర్ బాలికపై అత్యాచారం చేసిన నిందితుడికి జీవిత ఖైదు విధించింది. వివరాల్లోకి వెళ్తే.. కడప జిల్లాకు చెందిన 11 ఏళ్ల బాలిక సెలవుల్లో తన అమ్మమ్మ వాళ్ల ఇంట్లో కొన్ని రోజులు ఉండేందుకు వచ్చింది. ఆమె తనకు ఇషమైన వాటిని కొనుక్కునేందుకు ప్రతి రోజు దగ్గర్లో ఉన్న కిరాణ షాపుకు రావడాన్ని గమనించాడు ముత్తుకూరు ఎమ్మార్వో కాలనీకి చెందిన సాయికృష్ణ. చాకెట్లు, బిస్కెట్లు కొనిపించి మచ్చిక చేసుకుని సదరు మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇలా చాలాసార్లు తన ఆటవిక బుద్దిని ప్రదర్శించాడు. ఒకరోజు బాలిక ఇంట్లో సాయికృష్ణ ఆగడాల గురించి చెప్పింది. వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన పోలీసులు అతడిని కోర్టులో హాజరుపరిచారు. బాలిక కోర్టులో లైంగిక దాడి జరిగినట్టు వాంగ్మూలం ఇవ్వడంతో అతడిని కోర్టు దోషిగా తేల్చింది.

2015లో నమోదైన ఈ కేసుపై నెల్లూరు ఒకటో అడిషనల్ డిస్ట్రిక్ సెషన్స్ కోర్టు నిందితుడు సాయికృష్ణను చనిపోయేంతవరకు జైలులోనే ఉంచాలని సంచలన తీర్పు వెలువరించారు. జైలు శిక్షతో పాటు రూ.2లక్షల జరిమానా సైతం విధించారు.

Loading...
Unable to load recommendations.
Follow Us