తిరుచానూరు శ్రీకృష్ణస్వామివారి ఆలయంలో జన్మాష్టమి వేడుకలు!

గోకులాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీకృష్ణస్వామి వారి ఆలయంలో బుధవారం పర్వదినాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. కరోనా నిబంధ‌న‌ల మేర‌కు

  • Tv9 Telugu
  • Publish Date - 9:37 pm, Wed, 12 August 20
తిరుచానూరు శ్రీకృష్ణస్వామివారి ఆలయంలో జన్మాష్టమి వేడుకలు!

Janmashtami Celebrations: గోకులాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీకృష్ణస్వామి వారి ఆలయంలో బుధవారం పర్వదినాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. కరోనా నిబంధ‌న‌ల మేర‌కు ఆల‌యంలో ఈ కార్యక్రమాన్ని ఏకాంతంగా చేపట్టారు. ఈ సందర్భంగా ఉదయం శ్రీకృష్ణస్వామి మూలవర్లకు అభిషేకం, అర్చన నిర్వహించారు. మధ్యాహ్నం స్నపన తిరుమంజనంలో భాగంగా పలు రకాల సుగంధద్రవ్యాలతో ఉత్సవమూర్తులకు అభిషేకం చేశారు. సాయంత్రం స్వామివారికి ఊంజల్‌సేవ అనంతరం గోపూజ‌, గోకులాష్ట‌మి ఆస్థానం నిర్వ‌హించారు. రేపు ఉట్లోత్స‌వాన్ని నిర్వహిస్తారు.

Read More:

తెలంగాణలో కొత్తగా 1,897 కరోనా కేసులు.. 9మంది మృతి!

ఆగస్టు 16 నుంచి వైష్ణోదేవి యాత్ర..  ఆంక్షలతో..!