కరోనా రోగుల సేవలో డాక్టర్ గా ఐర్లండ్ ప్రధాని

తమ దేశంలో కరోనా రోగులకు సేవలందించేందుకు ఐర్లండ్ ప్రధాని లియో వరాద్కర్ మళ్ళీ డాక్టర్ గా మారారు. వారంలో ఒక షిఫ్ట్ తను వైద్యునిగా పని చేస్తానని ఆయన ప్రకటించారు. ఈ విధంగా మా దేశ హెల్త్ సర్వీసుకు హామీ ఇస్తున్నా అని ఆయన చెప్పారు.

కరోనా రోగుల సేవలో డాక్టర్ గా  ఐర్లండ్ ప్రధాని
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 06, 2020 | 2:29 PM

తమ దేశంలో కరోనా రోగులకు సేవలందించేందుకు ఐర్లండ్ ప్రధాని లియో వరాద్కర్ మళ్ళీ డాక్టర్ గా మారారు. వారంలో ఒక షిఫ్ట్ తను వైద్యునిగా పని చేస్తానని ఆయన ప్రకటించారు. ఈ విధంగా మా దేశ హెల్త్ సర్వీసుకు హామీ ఇస్తున్నా అని ఆయన చెప్పారు. గతంలో ఏడేళ్ల పాటు లియో డాక్టర్ గా వ్యవహరించారు.  డబ్లిన్ లోని రెండు ప్రధాన ఆసుపత్రుల్లో జూనియర్ డాక్టర్ గా పని చేసి ఎంతోమంది రోగులకు చికిత్స చేశారు. అయితే రాజకీయ నేత అయిన అనంతరం.. 2013 లోదేశ మెడికల్ రిజిస్టర్ నుంచి ఆయన పేరును తొలగించారు. కానీ తాజాగా ఐర్లాండ్ లో కరోనా వైరస్ రోగుల  సంఖ్య 5 వేలకు చేరడంతో .. వరాద్కర్ మళ్ళీ స్టెతస్కోప్ పట్టక తప్పలేదు. మెడికల్ రిజిస్టర్ లో తన హోదాను   డాక్టర్ గా తిరిగి నమోదు చేయించుకున్నారు. ఈయన కుటుంబ సభ్యుల్లో పలువురు వైద్య వృత్తిలో ఉన్నవారే.. కరోనా నేపథ్యంలో లియో వరాద్కర్ తీసుకున్న నిర్ణయాన్ని ఐర్లండ్ హెల్త్ సర్వీసు అభినందించింది. కాగా-కరోనా రోగులకు చికిత్స చేసేందుకు ముందుకు రావలసిందిగా ప్రభుత్వం నోటిఫికేషన్ వంటిది జారీ చేయగానే సుమారు 70 వేల మంది మాజీ హెల్త్ వర్కర్లు, డాక్టర్లు, ఇతర ప్రొఫెషనల్స్ ముందుకు వచ్చారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.