అంతర్జాతీయ విమాన సర్వీసులు అప్పుడే.. కేంద్రమంత్రి క్లారిటీ..

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మార్చిలో లాక్‌డౌన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనితో దేశీయ, విదేశీ విమాన సర్వీసులన్నీ కూడా నిలిచిపోయాయి. అయితే ఆ తర్వాత కేంద్రం లాక్‌డౌన్‌లో పలు సడలింపులు ఇవ్వడంతో తాజాగా దేశీయ విమాన సర్వీసులు పునః ప్రారంభమయ్యాయి. ఈ తరుణంలో అంతర్జాతీయ సర్వీసులు ఎప్పుడు ప్రారంభమవుతాయన్న దానిపై కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరీ క్లారిటీ ఇచ్చారు. జూలై నెలలో అంతర్జాతీయ విమాన సర్వీసులను పునరుద్దరించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు […]

అంతర్జాతీయ విమాన సర్వీసులు అప్పుడే.. కేంద్రమంత్రి క్లారిటీ..
Follow us

|

Updated on: Jun 17, 2020 | 4:11 PM

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మార్చిలో లాక్‌డౌన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనితో దేశీయ, విదేశీ విమాన సర్వీసులన్నీ కూడా నిలిచిపోయాయి. అయితే ఆ తర్వాత కేంద్రం లాక్‌డౌన్‌లో పలు సడలింపులు ఇవ్వడంతో తాజాగా దేశీయ విమాన సర్వీసులు పునః ప్రారంభమయ్యాయి. ఈ తరుణంలో అంతర్జాతీయ సర్వీసులు ఎప్పుడు ప్రారంభమవుతాయన్న దానిపై కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరీ క్లారిటీ ఇచ్చారు.

జూలై నెలలో అంతర్జాతీయ విమాన సర్వీసులను పునరుద్దరించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అయితే ఖచ్చితమైన తేదీ ఇప్పుడు చెప్పలేమని.. త్వరలోనే దీనికి సంబంధించిన వివరాలను ప్రకటిస్తామన్నారు. కరోనా నేపధ్యంలో ప్రయాణీకులు, వాటాదారులకు ముందు నమ్మకం కలిగించాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. కాగా, విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను తిరిగి తీసుకొచ్చేందుకు వందే భారత్ మిషన్ కొనసాగుతోందని కేంద్రమంత్రి వెల్లడించారు.

Also Read:

నిరుద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్…

భారత జవాన్ల మరణం తీవ్ర వేదన కలిగించింది…

బ్రేకింగ్: సుశాంత్ కుటుంబంలో మరో విషాదం..

ఏపీ నిట్ విద్యార్ధులకు గుడ్ న్యూస్.. 25 మార్కులకే పరీక్ష!

30 ఏళ్ల పాటు జగన్ సీఎంగా ఉండాలనుకుంటున్నాః రఘురామకృష్ణంరాజు

‘సుశాంత్‌పై కపట ప్రేమ చూపిస్తున్నారు’.. నెపోటిజంపై సైఫ్ ఫైర్..