విదేశీ గడ్డలపై తేలిపోతుందనే అపవాదును తొలగించేందుకు భారత జట్టుకు మాజీ క్రికెటర్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కీలక సూచనలు చేశారు. ఆసీస్ బ్యాటింగ్ లైనప్ వెన్ను విరించేందుకు అనుసరించాల్సిన బౌలింగ్ వ్యూహాలు, ప్రణాళికలను సూచించారు. ప్రత్యేకంగా ఆసీస్ ఆటగాళ్ల ఆటకట్టించేందుకు పేసర్లకు సచిన్ సలహాలిచ్చారు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని నిలుపుకునేందుకు చిట్కాలను చెప్పారు. కాగా, ఆసీస్ తో భారత జట్టు నవంబర్ 27 నుంచి మూడు వన్డేలు, మూడు టీ ట్వంటీలు, నాలుగు టెస్టులు మ్యాచ్‌లు ఆడనుంది. ముఖ్యంగా బ్యాటింగ్ లైనప్ బలంగా ఉన్న ఆసీస్ జట్టును దెబ్బతీసేందుకు భారత బౌలింగ్ జట్టు మరింత శ్రమించాల్సి ఉంటుందని సచిన్ అభిప్రాయపడ్డారు.
స్మిత్ ను ఇలా అవుట్ చేయండి..
ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌ను ఔట్ చేసేందుకు స్పెషల్ ఫ్లాన్ ఉండాలని భారత సీమర్లకు సూచించారు. స్మిత్ వికెట్ లభించాలంటే భారత సీమర్ల బృందం షార్ట్ పిచ్ బంతులు కాకుండా ఫిఫ్త్ స్టంట్‌ను ఊహించుకొని బౌలింగ్ చేయాలన్నారు. ఆఫ్ స్టంప్ మీదుగా బౌలింగ్ చేస్తే స్మిత్ ను బోల్తా కొట్టించడం ఈజీ అవుతుందన్నారు. అయితే, ఆసీస్ పిచ్‌లు భారత బౌలర్లకు సవాలు విసురుతాయని, భారత్‌లో లాగా స్వింగ్‌కు అంతగా సహకరించపోవచ్చని అన్నారు. సాధ్యమైన మేర యార్కర్ వేయాలని సూచించారు. అయితే జట్టులోని బుమ్రా, షమీ, ఇషాంత్, ఉమేష్ ఆ సామర్థ్యం కలిగిన బౌలర్లని సచిన్ అభిప్రాయపడ్డారు.
పటిష్టమైన బౌలింగ్ లైనప్ ఉన్న టీమిండియా 20 వికెట్లు తీసే సత్తా ఉన్న జట్టని సచిన్ విశ్వాసం వ్యక్తం చేశారు. మేడిన్ ఓవర్లు వేయడం, 20 వికెట్లు తీసినప్పుడే విజయావకాశాలు అధికంగా ఉంటాయన్నారు. పింక్ బాల్ తో డిసెంబర్ 17 మొదలు కానున్న మూడో టెస్టు మ్యాచ్ విజయాన్నిమొదట బ్యాటింగ్ చేసిన జట్టు ఇచ్చే డిక్లేర్‌పై ఆధారపడి ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఆ మ్యాచ్‌లో ఫస్ట్ సెషన్‌లో బ్యాట్స్‌మెన్ త్వరగా పరుగులు రాబట్టాలని, మధ్యాహ్నం తర్వాత పింక్ బాల్ స్వింగ్ అవడం మొదలవుతుందని తెలిపారు. ఇన్సింగ్స్ డిక్లరేషన్ విషయంలో పరుగుల కంటే సమయానికే ప్రాముఖ్యత ఇవ్వాలని టీమిండియాకు సూచించారు. ఒకవేళ బోర్డుపై అధిక రన్నులు పెట్టడంపై దృష్టిపెడితే తర్వాతి టీం వికెట్లు తీయడం కష్టం అవుతుందని, అందుకే ఇన్నింగ్స్ త్వరగా డిక్లెర్ చేసి ప్రత్యర్థి జట్టు వికెట్లను నాలుగో సెషన్‌లో తీయడం భారత విజయావకాశాలకు సహకరిస్తుందని అన్నారు.
భారత జట్టు కంటే ఆసీస్ ఓపెనింగ్ జోడీ బలంగా ఉంది..
ఆసీస్ స్టార్ ఆటగాళ్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ మంచి ఫామ్‌లో ఉన్నారని సచిన్ అభిప్రాయపడ్డారు. ఐపీఎల్‌లో డేవిడ్ వార్నర్ చాలా బాగా ఆడారని అన్నారు. గతంలో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఈ ఇద్దరు ఆటగాళ్లు బాల్ ట్యాపింగ్ కారణంగా అందుబాటులో లేని విషయాన్ని గుర్తు చేశారు. వారిని ఎంత తర్వరగా అవుట్ చేస్తే భారత విజయావకాశాలు అంత మెరుగవుతాయని అన్నారు.
కాగా, భారత బ్యాటింగ్ లైనప్ కూడా బలంగా ఉందని సచిన్ అభిప్రాయపడ్డారు. రోహిత్, కెప్టెన్ విరాట్ కొహ్లీ, ధవన్, చతేశ్వర పుజారా, మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్‌తో కూడిన స్ట్రాంగ్ లైనప్ ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే రోహిత్‌తో ఓపెనింగ్ జోడిగా మయాంక్ అగర్వాల్ జతకడితే ఎక్కువ రన్స్ వచ్చే అవకాశాలున్నాయని తెలిపారు. తర్వాతి స్థానాల్లో కొహ్లీతో పాటు చతేశ్వర పుజారా వస్తే బాగుంటుందని సచిన్ అభిప్రాయపడ్డారు. కాగా, విరాట్ మొదటి టెస్టు తర్వాత రెండో టెస్టుకు అందుబాటులో లేకున్నా భారత జట్టుకు ఎటువంటి ిఇబ్బంది ఎదురవదని సచిన్ అన్నారు. విరాట్ భార్య అనుష్క డిసెంబర్ రెండో వారంలో బిడ్డకు జన్మనివ్వబోతోంది. ఈ నేపథ్యంలోనే విరాట్ రెండో టెస్టు మ్యాచ్ నుంచి అందుబాటులో ఉండకపోవచ్చని సమచారం.