చరిత్ర సృష్టించిన భారత్.. మొబైల్స్ తయారీలో.. రెండో అతిపెద్ద దేశంగా..

| Edited By:

Jun 02, 2020 | 1:42 PM

గత ఐదేళ్లలో దేశంలో 200 కి పైగా మొబైల్ ఫోన్ తయారీ యూనిట్లు ఏర్పాటు చేయడంతో, ప్రపంచంలో రెండవ అతిపెద్ద మొబైల్ ఫోన్ తయారీదారుగా భారత్ ఎదిగిందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ

చరిత్ర సృష్టించిన భారత్.. మొబైల్స్ తయారీలో.. రెండో అతిపెద్ద దేశంగా..
Follow us on

గత ఐదేళ్లలో దేశంలో 200 కి పైగా మొబైల్ ఫోన్ తయారీ యూనిట్లు ఏర్పాటు చేయడంతో, ప్రపంచంలో రెండవ అతిపెద్ద మొబైల్ ఫోన్ తయారీదారుగా భారత్ ఎదిగిందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. మంగళవారం (జూన్ 2) విలేకరుల సమావేశంలో భారతీయ ఎలక్ట్రానిక్స్ కోసం కొత్త పథకాలను కేంద్ర మంత్రి ప్రారంభించనున్నారు.

ట్విట్టర్ లో #ThinkElectronicsThinkIndia అనే హ్యాష్ ట్యాగ్ తో ఆయన ట్వీట్ చేశారు. మంత్రి షేర్ చేసిన గ్రాఫ్ ప్రకారం… ఇండియా… 2020 ఆర్థిక సంవత్సరంలో… 3.6 కోట్ల స్మార్ట్‌ఫోన్లను ఎగుమతి చేసింది. 2019 ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య 1.7 కోట్లుగా ఉంది. అంటే ఏడాది కాలంలో వృద్ధి రేటు 111.76 శాతం పెరిగిగినట్లే. విలువ ప్రకారమైతే.. మొత్తం రూ.21000 కోట్ల విలువైన మొబైల్స్ 2020 ఆర్థిక సంవత్సరంలో ఎగుమతి అయ్యాయి. విలువ ప్రకారం గ్రోత్ రేట్ 91 శాతం ఎక్కువగా ఉంది.

ఎలక్ట్రానిక్ రంగంలో మొబైల్ ఫోన్ల తయారీకి భారతే కేంద్రం అని ప్రపంచ దేశాలు భావించడానికి ఇదే సరైన సమయమని కేంద్ర మంత్రి తెలిపారు. శాంసంగ్, రియల్ మి, జియోమీ కంపెనీలు ఇండియాలో హ్యాండ్‌సెట్ల తయారీలో ముందున్నాయని ఆయన వివరించారు. యాపిల్ కంపెనీ కూడా మొబైల్ పరికరాల్ని ఇండియాలో తయారుచేయించేందుకు సిద్ధమైందని చెప్పారు. దక్షిణ కొరియాకు చెందిన శాంసంగ్ ఇప్పటికే ప్రపంచంలోనే అతి పెద్ద మొబైల్ ఫ్యాక్టరీని ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలో నిర్మించింది.

[svt-event date=”02/06/2020,1:29PM” class=”svt-cd-green” ]