సేఫ్ జోన్‌కి అభినందన్..? బదిలీకి ఐఏఎఫ్ ప్లాన్.!

వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌ను ఐఏఫ్ వేరే సెక్టార్‌కు బదిలీ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు శ్రీనగర్ ఎయిర్‌బేస్‌లో అభినందన్ విధులు నిర్వహించారు. మున్ముందు కశ్మీర్ లోయలో విధులకు డిప్యూట్ చేసిన పక్షంలో ఆయనకు హాని కలగవచ్చన్న భావనతో ఎయిర్ ఫోర్స్ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఆయనను వెస్ట్రన్ సెక్టార్‌కు బదిలీ చేసినట్టు సమాచారం. కాగా కొన్ని వారాలుగా చికిత్స తీసుకుంటున్న అభినందన్ మళ్లీ విధుల్లోకి చేరనున్నారని ఐఏఎఫ్ అధికారులు చెబుతున్నారు. అంతేకాకుండా […]

సేఫ్ జోన్‌కి అభినందన్..? బదిలీకి ఐఏఎఫ్ ప్లాన్.!

Updated on: Apr 21, 2019 | 12:27 PM

వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌ను ఐఏఫ్ వేరే సెక్టార్‌కు బదిలీ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు శ్రీనగర్ ఎయిర్‌బేస్‌లో అభినందన్ విధులు నిర్వహించారు. మున్ముందు కశ్మీర్ లోయలో విధులకు డిప్యూట్ చేసిన పక్షంలో ఆయనకు హాని కలగవచ్చన్న భావనతో ఎయిర్ ఫోర్స్ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఆయనను వెస్ట్రన్ సెక్టార్‌కు బదిలీ చేసినట్టు సమాచారం. కాగా కొన్ని వారాలుగా చికిత్స తీసుకుంటున్న అభినందన్ మళ్లీ విధుల్లోకి చేరనున్నారని ఐఏఎఫ్ అధికారులు చెబుతున్నారు. అంతేకాకుండా వీర చక్ర పురస్కారానికి అభినందన్ పేరును ఐఏఎఫ్ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.

Loading...
Unable to load recommendations.
Follow Us