షూటింగ్‌లో గాయపడ్డ హీరో అఖిల్.. తీవ్ర గాయాలు

షూటింగ్ స్పాట్‌లో యంగ్ హీరో అక్కినేని అఖిల్‌ గాయపడ్డారట. తాజాగా అఖిల్ నటిస్తోన్న చిత్రం 'మోస్ట్ ఎలిజిల్ బ్యాచిలర్'. బొమ్మరిల్లు భాస్కర్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో..

షూటింగ్‌లో గాయపడ్డ హీరో అఖిల్.. తీవ్ర గాయాలు

Updated on: Mar 05, 2020 | 8:03 PM

షూటింగ్ స్పాట్‌లో యంగ్ హీరో అక్కినేని అఖిల్‌ గాయపడ్డారట. తాజాగా అఖిల్ నటిస్తోన్న చిత్రం ‘మోస్ట్ ఎలిజిల్ బ్యాచిలర్’. బొమ్మరిల్లు భాస్కర్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతుంది. కాగా ఈ చిత్రం షూటింగ్‌లో అఖిల్ గాయపడ్డట్టు తెలుస్తోంది. ఒక ఫైట్ చిత్రీకరణలో ప్రమాదవ శాత్తూ అఖిల్ చేతికి తీవ్ర గాయమైందని సమాచారం. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారట. దీంతో షూటింగ్‌ను నిలిపివేసారని.. అఖిల్ తిరిగి కోలుకునేంత వరకూ చిత్రయూనిట్ షూటింగ్ వాయిదా వేసింది. కాగా.. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీ వాస్, వాసు వర్మ నిర్మిస్తున్నారు. గోపీ సుందర్ సంగీతం సమకూర్చుతున్నారు.

Read More: జబర్దస్త్ కమెడియన్లకు సీరియస్ వార్నింగ్.. ‘పిచ్చి కతలు’ పడితే..

Loading...
Unable to load recommendations.
Follow Us