ఓరుగల్లులో మిడతలు..వర్రీ అవుతున్న రైతులు

రాష్ట్ర సరిహద్దులోనే మిడతలను అడ్డుకోవాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు ఇంకా గ్రౌండ్ లెవెల్‌కు చేరకముందే తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో మిడతల దండు దండయాత్ర మొదలైంది. పంటల పతనానికి దండుగా దార పడుతున్నాయి. వరంగల్ ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో...

ఓరుగల్లులో మిడతలు..వర్రీ అవుతున్న రైతులు
Follow us

|

Updated on: May 29, 2020 | 4:20 PM

రాష్ట్ర సరిహద్దులోనే మిడతలను అడ్డుకోవాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు ఇంకా గ్రౌండ్ లెవెల్‌కు చేరకముందే తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో మిడతల దండు దండయాత్ర మొదలైంది. పంటల పతనానికి దండుగా దార పడుతున్నాయి. వరంగల్ ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో పంట ఉత్పత్తులపై మిడతలు దండయాత్ర ప్రారంభించడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. రంగంలోకి దిగిన వ్యవసాయ శాఖ అధికారులు ఆరంభంలోనే వాటిని నివారించే ప్రయత్నాలు మొదలుపెట్టారు.

ఇప్పటికే కరోనా దెబ్బతో విలవిలలాడుతున్న అన్నదాతలకు ఇప్పుడు ఊహించని ముప్పు ముంచుకొస్తుంది. పొరుగు దేశాల నుండి మనదేశంలోకి ప్రవేశించిన మిడత పురుగులు ఇప్పటికే పలు రాష్ట్రాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. మహారాష్ట్రను కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. ఐతే మహారాష్ట్ర- తెలంగాణ సరిహద్దు రాష్ట్రాలు కాబట్టి ఈ మిడతలు తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశాలున్నాయని రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా అప్రమత్తం అయింది. మహారాష్ట్ర సరిహద్దుల్లోని జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోముందస్తు నివారణ చర్యలు చేపట్టారు. సరిహద్దు ప్రాంతాల్లో క్లోరో పైరపస్ 50ఈసీ రసాయనాన్ని స్ప్రే చేస్తున్నారు. ఇప్పటికే మిడతలు దండును ఎదుర్కొనేందుకు డ్రోన్లు సిద్ధం చేశారు.

ఒకవైపు రాష్ట్రాల సరిహద్దుల్లో ముందస్తు నివారణ చర్యలు కొనసాగుతుంటే మరోవైపు ఇప్పటికే ఒక్కటొక్కటిగా చేరుకుంటున్న మిడతలు రైతులకు వణుకు పుట్టిస్తున్నాయి. తాజాగా మహబూబాబాద్ జిల్లాలో మిడతల దండు కలకలం రేపుతుంది. ఇవి ప్రస్తుతం పంట పొలాలమీదికి పరిమితమవగా,వ్వవసాయాధికారులు తక్షణమే స్పందించారు. మురళి అనే ఓ రైతు డైరీ ఫాం నడుపుతున్నాడు. వాటి మేత కోసం సొప్ప చెట్లను రెండు ఎకరాలలో పెంచుతున్నాడు. ఈ చెట్లు తియ్యదనాన్ని కల్గి ఉండటంతో పాటు, రసాన్ని కల్గి ఉంటాయి. ఈ సొప్ప చెట్ల మీద మిడతల దండు వాలి వాటిని క్షణాల్లో పిప్పి చేస్తున్నాయి.. దింతో స్థానికంగా ఆందోళన మొదలైంది.

ఐతే ఇవి పొరుగు రాష్ట్రాల నుండి వచ్చినవి కావని స్థానికంగా వచ్చే మిడతలని అధికారులు అంటున్నారు.. అయితే ఈ రెండు ఎకరాలలో ఉన్న మిడతలు భారీ సంఖ్యలో ఉన్నాయి. ఇవి సాయంత్రం వేళ చేనులో స్వేచ్చగా విహరిస్తున్నాయి. సొప్ప చెట్ల ఆకులు తినేయడంతో మిడతల దండు వస్తుందన్న ప్రచారం జరుగుతోంది. దీంతో స్థానికుల్లో ఆందోళన పెరిగింది.

మిడతల దండు ఒక్కసారిగా చేనుపై దండెత్తడంతో ప్రజలు భయాందోళను గురవుతున్నారు. మిడతలు సొప్ప చేనులో వాలి మొక్కల ఆకులను మొత్తం తినేయడం ఆందోళన కల్గిస్తుంది. మిడతల దండు వచ్చి పంటలను నాశనం చేయడం గతంలో టీవీల్లో చూశాం కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నామని, ఇంత భయకరంగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.