వాహనదారులకు కేంద్రం గుడ్ న్యూస్..

వాహనదారులకు ఊరటను కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫిట్‌నెస్‌ సర్టిఫికేట్స్, పర్మిట్స్, లైసెన్స్, రిజిస్ట్రేషన్లతో పాటు ఇతర పత్రాల వ్యాలిడిటీ గడువును ఈ ఏడాది డిసెంబర్ 31...

వాహనదారులకు కేంద్రం గుడ్ న్యూస్..

Updated on: Aug 25, 2020 | 1:09 AM

Govt extends validity of vehicle documents: వాహనదారులకు ఊరటను కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫిట్‌నెస్‌ సర్టిఫికేట్స్, పర్మిట్స్, లైసెన్స్, రిజిస్ట్రేషన్లతో పాటు ఇతర పత్రాల వ్యాలిడిటీ గడువును ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు పొడిగిస్తునట్లు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ వెల్లడించింది.

Also Read: బాలకృష్ణ గొప్ప మనసు.. కోవిడ్ ఆసుపత్రికి భారీ విరాళం..

ప్రస్తుతం దేశంలో ఉన్న కరోనా ప్రభావం, కంటైన్మెంట్ జోన్లలో అమలవుతున్న లాక్ డౌన్ దృష్ట్యా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. మోటర్ వెహికల్స్ యాక్ట్ 1988, సెంట్రల్ మోటర్ వెహికల్ రూల్స్, 1989 ప్రకారం ఈ గడువును పొడిగించింది. కాగా, గతంలో కేంద్రం కరోనా కారణంగా మార్చి 30, జూన్ 9 రెండుసార్లు ఫిట్‌నెస్‌ సర్టిఫికేట్స్, పర్మిట్స్, లైసెన్స్, రిజిస్ట్రేషన్లతో పాటు ఇతర పత్రాల వ్యాలిడిటీ గడువును పెంచిన సంగతి తెలిసిందే.

Also Read: ఢిల్లీ టూ లండన్.. బస్సులో అడ్వెంచర్ జర్నీ..

Follow Us