ఆ చైనా యాప్స్‌పై నిషేధం విధించలేదుః కేంద్రం

చైనా యాప్స్‌పై నిషేధం విధించినట్లుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఓ మెసేజ్‌పై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అఫ్ ఇండియా స్పందించింది.

ఆ చైనా యాప్స్‌పై నిషేధం విధించలేదుః కేంద్రం
Follow us

|

Updated on: Jun 22, 2020 | 9:11 AM

చైనా యాప్స్‌పై నిషేధం విధించినట్లుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఓ మెసేజ్‌పై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అఫ్ ఇండియా స్పందించింది. అది కేవలం ఫేక్ న్యూస్ మాత్రమేనని.. గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్‌లలో ఎలాంటి చైనా యాప్స్‌ను నిషేధించమని కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయలేదని స్పష్టం చేసింది. కొన్ని చైనా యాప్స్‌ను భారత్‌లో నిషేధం విధించినట్లుగా పేర్కొంటూ.. ‘వాటి పనితీరును తక్షణమే పరిమితం చేయాలని గూగుల్, ఆపిల్ ప్రతినిధులను భారత ప్రభుత్వం ఆదేశిస్తూ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, జాతీయ సమాచార కేంద్రం ఉత్తర్వులు విడుదల చేసినట్లుగా పేర్కొన్న ఓ పోస్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.

టిక్‌టాక్, విమేట్, విగో వీడియో, లైవ్‌మీ, బిగో లైవ్, బ్యూటీ ప్లస్, కామ్‌స్కానర్, క్లబ్ ఫ్యాక్టరీ, షెయిన్, రోమ్‌వే, యాప్‌లాక్ వంటి చైనీస్ యాప్స్‌ను నిషేధిస్తున్నట్లుగా ఆ పోస్టులో ఉంది. ఈ జాబితాలో మొబైల్ లెజెండ్స్, క్లాష్ ఆఫ్ కింగ్స్, గేల్ ఆఫ్ సుల్తాన్స్ వంటి గేమింగ్ యాప్స్ కూడా ఉన్నాయి. ఈ అప్లికేషన్స్ అన్నీ కూడా వినియోగదారుడి గోప్యతను ప్రమాదంలో పడేస్తాయని, దేశ సార్వభౌమత్వాన్ని రాజీపడేలా చేస్తాయంటూ ఆ పోస్టులో ఉంది. కాగా, ఆ పోస్టు, ఉత్తర్వులు నకిలీవని.. కేంద్రం ప్రభుత్వం చైనా యాప్స్‌పై నిషేధం విధించాలంటూ ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయలేదని పీఐబీ క్లారిటీ ఇచ్చింది.

Latest Articles
మీరు రైల్లో ప్రయాణిస్తున్నారా? ఈ నియమాలు తెలుసా?
మీరు రైల్లో ప్రయాణిస్తున్నారా? ఈ నియమాలు తెలుసా?
పుచ్చకాయ గింజల్లో అంతుందా.. ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే.. అవాక్కే!
పుచ్చకాయ గింజల్లో అంతుందా.. ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే.. అవాక్కే!
48 గంటల్లో ఎన్నికలు.. ఎమోషనల్ అయిన దిగ్విజయ్ సింగ్..!
48 గంటల్లో ఎన్నికలు.. ఎమోషనల్ అయిన దిగ్విజయ్ సింగ్..!
కోహ్లితోపాటు స్టార్ స్పోర్ట్స్‌పై విమర్శలు గుప్పించిన గవాస్కర్
కోహ్లితోపాటు స్టార్ స్పోర్ట్స్‌పై విమర్శలు గుప్పించిన గవాస్కర్
పవన్ జల్సా మూవీ హీరోయిన్ ఇంతగా మారిపోయిందేంటీ..?
పవన్ జల్సా మూవీ హీరోయిన్ ఇంతగా మారిపోయిందేంటీ..?
రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఆ ఐదు కిలోమీటర్ల పరిధి ఎత్తివేత..
రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఆ ఐదు కిలోమీటర్ల పరిధి ఎత్తివేత..
అబ్బాయిలతో ఫోన్‌ మట్లాడొద్దని మందలించినందుకు..అన్నను చంపిన చెల్లి
అబ్బాయిలతో ఫోన్‌ మట్లాడొద్దని మందలించినందుకు..అన్నను చంపిన చెల్లి
ఉర్ఫీ మ్యాజికల్ బట్టర్ ఫ్లై డ్రెస్ పై సమంత కామెంట్స్..
ఉర్ఫీ మ్యాజికల్ బట్టర్ ఫ్లై డ్రెస్ పై సమంత కామెంట్స్..
ఫిక్స్‌డ్ డిపాజిట్ నుంచి నెలవారీ వడ్డీని ఎలా పొందాలి ?
ఫిక్స్‌డ్ డిపాజిట్ నుంచి నెలవారీ వడ్డీని ఎలా పొందాలి ?
ఎంఐఎం - కాంగ్రెస్ కార్యకర్తల మధ్య కత్తుల దాడి.. ఒకరు మృతి
ఎంఐఎం - కాంగ్రెస్ కార్యకర్తల మధ్య కత్తుల దాడి.. ఒకరు మృతి