ఆ నిర్ణయం వెనక్కు తీసుకోలేదా.. మీకు చావే గతి..

కేరళలోని ఓ ముస్లిం విద్యాసంస్థల అధిపతికి చంపేస్తామని బెదిరింపు కాల్‌ వచ్చింది. తమ విద్యాసంస్థల్లో యువతులు, మహిళలెవరూ ముసుగు ధరించకూడదని ఆయన ఇటీవల ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ బెదిరింపు కాల్‌ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఇటీవల తాను ఇచ్చిన ఆదేశాన్ని వెనక్కు తీసుకోకపోతే చంపేస్తామంటూ తనకు కాల్‌ వచ్చిందని ముస్లిం ఎడ్యుకేషనల్‌ సొసైటీ అధ్యక్షుడు పీఏ ఫజల్‌ గఫూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోజికోడ్‌కు చెందిన ఈ సంస్థకు కేరళ వ్యాప్తంగా 150 వరకూ […]

ఆ నిర్ణయం వెనక్కు తీసుకోలేదా.. మీకు చావే గతి..
Follow us

| Edited By:

Updated on: May 04, 2019 | 6:09 PM

కేరళలోని ఓ ముస్లిం విద్యాసంస్థల అధిపతికి చంపేస్తామని బెదిరింపు కాల్‌ వచ్చింది. తమ విద్యాసంస్థల్లో యువతులు, మహిళలెవరూ ముసుగు ధరించకూడదని ఆయన ఇటీవల ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ బెదిరింపు కాల్‌ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఇటీవల తాను ఇచ్చిన ఆదేశాన్ని వెనక్కు తీసుకోకపోతే చంపేస్తామంటూ తనకు కాల్‌ వచ్చిందని ముస్లిం ఎడ్యుకేషనల్‌ సొసైటీ అధ్యక్షుడు పీఏ ఫజల్‌ గఫూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోజికోడ్‌కు చెందిన ఈ సంస్థకు కేరళ వ్యాప్తంగా 150 వరకూ స్కూళ్లు, కళాశాలలు ఉన్నాయి. అయితే విద్యా సంస్థల అధినేతకు వచ్చిన కాల్‌ గల్ఫ్‌ దేశాల నుంచి వచ్చిందని పోలీసులు గుర్తించారు.