ప్రైమ‌రీ కాంటాక్ట్స్ పై జీహెచ్ఎంసీ స్పెష‌ల్ ఫోక‌స్…

తెలంగాణలో క‌రోనా పూర్తిగా త‌గ్గుముఖం ప‌ట్టింది. అయితే ఏప్రిల్ 30, మే 1 తేదీల్లో కేవ‌లం జీహెచ్ఎంసీ ఏరియాలో ఎక్కువగా కేసులు న‌మోద‌య్యాయి. దీంతో మ‌ల్టి డిసిప్లిన‌రీ టీమ్స్ రంగంలోకి దిగాయి. క‌రోనావైర‌స్ పేషెంట్స్ నుంచి స‌మాచారాన్ని సేక‌రించి వారి ప్రైమ‌రీ కాంటాక్ట్ తెలుసుకునే ప‌నిలో ఉన్నాయి. శుక్ర‌వారం సాయంత్రం వ‌ర‌కు 46 మంది ప్రైమ‌ర్ కాంటాక్ట్ పీపుల్ ని క‌నుగొన్న అధికారులు..వారంద‌ర్నీ హెమ్ క్వారంటైన్ చేశారు. వీరంద‌రూ గ‌వ‌ర్న‌మెంట్ నామ్స్ ప్ర‌కారం 28 రోజులు గృహ […]

ప్రైమ‌రీ కాంటాక్ట్స్ పై జీహెచ్ఎంసీ స్పెష‌ల్ ఫోక‌స్...
Ram Naramaneni

|

May 02, 2020 | 4:17 PM

తెలంగాణలో క‌రోనా పూర్తిగా త‌గ్గుముఖం ప‌ట్టింది. అయితే ఏప్రిల్ 30, మే 1 తేదీల్లో కేవ‌లం జీహెచ్ఎంసీ ఏరియాలో ఎక్కువగా కేసులు న‌మోద‌య్యాయి. దీంతో మ‌ల్టి డిసిప్లిన‌రీ టీమ్స్ రంగంలోకి దిగాయి. క‌రోనావైర‌స్ పేషెంట్స్ నుంచి స‌మాచారాన్ని సేక‌రించి వారి ప్రైమ‌రీ కాంటాక్ట్ తెలుసుకునే ప‌నిలో ఉన్నాయి. శుక్ర‌వారం సాయంత్రం వ‌ర‌కు 46 మంది ప్రైమ‌ర్ కాంటాక్ట్ పీపుల్ ని క‌నుగొన్న అధికారులు..వారంద‌ర్నీ హెమ్ క్వారంటైన్ చేశారు. వీరంద‌రూ గ‌వ‌ర్న‌మెంట్ నామ్స్ ప్ర‌కారం 28 రోజులు గృహ నిర్భందంలో ఉండాల్సి ఉంటుంది. వీరిలో ఎక్కువ‌మంది మే 30న క‌రోనా పాజిటివ్ నిర్దార‌ణ అయినవారి నుంచే ప్రైమ‌రీ కాంటాక్ట్ అయ్యార‌ని తెలుస్తోంది.

మే 30న క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌యిన‌..మ‌ర‌ణాలు సంభవించిన జిహెచ్ఎంసీ రామంతాపూర్ ప‌రిధిలోని ఏరియాస్ లో అధికారులు ప్రైమ‌రీ కాంటాక్ట్స్ పై మ‌రింత ఫోక‌స్ పెట్టారు. దీంతో క‌రోనా వ్యాప్తిని జిహెచ్ఎంసీలో కూడా క‌ట్ట‌డి చేసి క‌రోనా ర‌హిత రాష్ట్రంగా మారేందుకు తెలంగాణ ముందుకు వెళ్తోంది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu