Begger Free HYD: భాగ్య నగరాన్ని బెగ్గర్‌ ఫ్రీ సిటీగా మార్చేందుకు మరో ముందడుగు.. జీహెచ్‌ఎమ్‌సీ స్పెషల్‌ డ్రైవ్‌..

GHMC Special Drive For Beggar Free HYD: హైదరాబాద్‌ మహానగరాన్ని యాచకులు లేని సిటీగా తీర్చిదిద్దేందుకు గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మరోముందడుగు వేసింది. పోలీసు, రెవెన్యూ శాఖల సహకారంతో త్వరలోనే ఒక ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహించేందుకు జీహెచ్‌ఎమ్‌సీ సిద్ధమవుతోంది...

Begger Free HYD: భాగ్య నగరాన్ని బెగ్గర్‌ ఫ్రీ సిటీగా మార్చేందుకు మరో ముందడుగు.. జీహెచ్‌ఎమ్‌సీ స్పెషల్‌ డ్రైవ్‌..
Follow us

|

Updated on: Jan 22, 2021 | 9:20 AM

GHMC Special Drive For Beggar Free HYD: హైదరాబాద్‌ మహానగరాన్ని యాచకులు లేని సిటీగా తీర్చిదిద్దేందుకు గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మరోముందడుగు వేసింది. పోలీసు, రెవెన్యూ శాఖల సహకారంతో త్వరలోనే ఒక ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహించేందుకు జీహెచ్‌ఎమ్‌సీ సిద్ధమవుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా నగరంలో మొత్తం ఎంతమంది బిచ్చగాళ్లు ఉన్నారన్న విషయాన్ని గుర్తించి.. అనంతరం వారిలో శారీరకంగా, మానసికంగా ధృడంగా ఉన్న వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి వారి కాళ్లపై వారు నిలబడేలా శిక్షణ ఇస్తారు. ఇక మానసిక, ఆరోగ్య సమస్యలతో బాధపడేవారికి పునారావస కేంద్రాలలో ఆశ్రయం కల్పించనున్నారు. జీహెచ్‌ఎమ్‌సీ ప్రధాన కార్యాలయంలో గురువారం జరిగిన నగర సమన్వయ కమిటీలో ఈ విషయమై అధికారులు చర్చించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్‌ఎమ్‌సీతో పాటు సైబరాబాద్‌, రాచకొండ, టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌, మెట్రో రైల్‌, హెచ్‌ఎమ్‌డీఏ డిపార్ట్‌మెంట్‌లకు చెందిన అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జీహెచ్‌ఎమ్‌సీ కమిషనర్‌ డీఎస్‌ లోకేష్‌ కుమార్‌ మాట్లాడుతూ.. ‘హైదరాబాద్‌ను యాచకులు లేని నగరంగా తీర్చిదిద్దే క్రమంలో ఒక ప్రత్యేక డ్రైవ్‌ను ప్రారంభించనున్నాం. ప్రజలు కూడా వారి వారి ప్రాంతాల్లో ఎవరైనా బిచ్చగాళ్లు ఉంటే సమాచారం అందించాలి’ అని చెప్పుకొచ్చారు. ఇక నగరంలో దెబ్బతిన్న రోడ్ల మరమ్మత్తులకు సంబంధించి వెంటనే పనులు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా జీహెచ్‌ఎమ్‌సీ నగర వ్యాప్తంగా సుమారు 30కిపైగా ఫూట్‌ ఓవర్‌ బ్రిడ్జిలను నిర్మిస్తున్నట్లు కమిషనర్‌ తెలిపారు.

Also Read: HYD City Buses: హైదరాబాద్‌ నగర ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌… రోడ్డెక్కనున్న మరిన్ని సిటీ బస్సులు..

Latest Articles
కొత్త ఓటర్లతో ముచ్చటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
కొత్త ఓటర్లతో ముచ్చటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..
కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!
కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!
ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.
ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.
ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?
ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?
మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!
మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!
అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!
అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!