బల్దియా పీఠంపై కన్నేసిన భారతీయ జనతాపార్టీ దూసుకుపోతోంది. ఢిల్లీ నుంచి గల్లీ దాకా అన్ని వర్గాల అగ్రనేతలను ఎన్నికల ప్రచారానికి దింపింది. తాజాగా గ్రేటర్ ఎన్నికల మేనిఫెస్టోను ఇవాళ బీజేపీ విడుదల చేసింది. మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ఈ మేనిఫెస్టోను బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఆ పార్టీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫడ్నవిస్ మాట్లాడుతూ.. తెలంగాణ ఆవిర్భావానికి సుదీర్ఘ పోరాటం జరిగిందన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మేనిఫెస్టో రూపొందించామన్నారు. తెలంగాణ ఏర్పాటులో బీజేపీ పాత్ర చాలా ఉందన్న ఫడ్నవిస్.. ప్రజలకు ఏం కావాలో బీజేపీకి తెలుసన్నారు. రాజ్యాంగాన్ని మోదీ సర్కార్ మాత్రమే కాపాడుతోందని ఆయన స్పష్టం చేశారు. గ్రేటర్‌లో గెలిపిస్తే సెప్టెంబర్ 17ని అధికారికంగా నిర్వహిస్తామని ఫడ్నవిస్ వెల్లడించారు.
బీజేపీ మేనిఫెస్టో హైలైట్స్ ఇవేః
సామాన్యుడి ఆకాంక్షల మేరకే బిజెపి మేనిఫెస్టో
బిజెపి గ్రేటర్ మేనిఫెస్టోను విడుదల చేసిన మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శ్రీ @Dev_Fadnavis#BJPManifesto
— BJP Telangana (@BJP4Telangana) November 26, 2020