గ్రేటర్ ఓటర్ ప్లీజ్ అటెన్షన్… ఓటర్ స్లిప్ పొందండిలా…

గ్రేటర్ ఎన్నికలను ప్రధాన పార్టీలన్నీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ముఖ్యంగా దుబ్బాక విజయంతో బీజేపీ రెట్టింపు ఉత్సాహంతో పార్టీ అగ్రశ్రేణి నేతలతో ప్రచారం హోరెత్తించగా..

గ్రేటర్ ఓటర్ ప్లీజ్ అటెన్షన్… ఓటర్ స్లిప్ పొందండిలా…
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Dec 01, 2020 | 6:12 AM

గ్రేటర్ ఎన్నికలను ప్రధాన పార్టీలన్నీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ముఖ్యంగా దుబ్బాక విజయంతో బీజేపీ రెట్టింపు ఉత్సాహంతో పార్టీ అగ్రశ్రేణి నేతలతో ప్రచారం హోరెత్తించగా.. అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపు బాధ్యతలను మంత్రి కేటీఆర్ తన భుజాన వేసుకుని ప్రచారం చేశారు. ఇదంతా పక్కన పెడితే ఈరోజు పోలింగ్ డేట్. ఇక ఇది ఓటర్ వంతు.. తమ నాయకుడిని ఎన్నుకునే అవకాశం. ఓటుకు సమయం ఆసన్నమయింది. గ్రేటర్ పరిధిలో ఓటు హక్కు ఉన్న వారంతా.. మీ ఓటర్ స్లిప్‌ను రెడీ చేసుకోండి. దానితో పాటు పాన్‌కార్డు, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ లాంటి ధృవపత్రాలను ఓటర్ తమ వెంట ఓటింగ్ కేంద్రానికి తీసువెళ్తేనే ఓటు హక్కు వినియోగించుకోవచ్చునని ఎస్ఈసీ తెలిపింది.

జీహెచ్ఎంసీలో ఓటు వేసేందుకు అవసరమైన ఓటర్ స్లిప్ డౌన్‌లోడ్ చేసేందిలా…

1. గూగుల్ ప్టే స్టోర్ నుంచి మై జీహెచ్ఎంసీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.

2. ఇన్‌స్టాల్ పూర్తయిన తర్వాత.. యాప్ ఓపెన్ చేయాలి. పేరు, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి రిజిస్టర్ చేసుకోవాలి. మొబైల్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేసి యాప్‌లోకి లాగిన్ కావాలి.

3. లాగిన్ అయిన తర్వాత స్క్రీన్‌పై డౌన్ లోడ్ యూవర్ ఓటర్ స్లిప్, నో యూవర్ పోలింగ్ స్టేషన్ ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయండి

4. తర్వాత సెర్చ్ బై ఎపిక్ నెంబర్ లేదా సర్చ్ బై నేమ్ ఆప్షన్లు కనిపిస్తాయి. ఒకవేళ మీ దగ్గర ఓటర్ ఐడీ నెంబర్ ఉంటే.. మీ వార్డు, ఎపిక్ నెంబర్ ఎంటర్ చేస్తే.. మీ ఓటర్ స్లిప్ వస్తుంది. అందులో మీ పోలింగ్ స్టేషన్ వివరాలు ఉంటాయి.

5. ఒకవేళ ఓటర్ ఐడీ లేకుంటే మీ వార్డు, మీ పేరును ఎంటర్ చేయవచ్చు. తర్వాత మీ పేరుతో ఉన్న వాళ్ల వివరాలన్నీ స్క్రీన్‌పై కనిపిస్తాయి. ఆ జాబితాలో ఇంటి నెంబర్, ఇంటి పేరుతో సెర్చ్ చేసి మీ వివరాలను గుర్తించవచ్చు.

6. మీ వివరాలపై క్లిక్ చేస్తే.. ఓటర్ స్లిప్ కనిపిస్తుంది. డౌన్ లోడ్ చేసుకోండి. అంతేకాదు వ్యూ డైరెక్షన్ ఆప్షన్ ద్వారా.. మీరుంటున్న ప్రాంతం నుంచి పోలింగ్ స్టేషన్‌కు గూగుల్ మ్యాప్స్‌లో దారి కూడా కనిపిస్తుంది.

Latest Articles
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
ఏంటి..! నభా నటేష్‌కు ఇంకా గాయం మానలేదా..
ఏంటి..! నభా నటేష్‌కు ఇంకా గాయం మానలేదా..