‘అమ్మ మీద ఒట్టు డబ్బులొస్తాయి’.. నవ్వులు పూయిస్తోన్న చాటింగ్

సోషల్ మీడియా పుణ్యమా అని ఎక్కడెక్కడో జరిగిన సంఘటనలు, ఫన్నీ వీడియోలు నిమిషాల్లో వైరల్‌గా మారుతున్నాయి. సరిహద్దుల్ని దాటేస్తూ ప్రపంచమంతా చుట్టేస్తున్నాయి. అలాంటిదే జొమాటో సంస్థ, కస్టమర్‌ మధ్య జరిగిన ఓ ఫన్నీ కన్వర్జేషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తోంది. జొమాటోలో ఓ కస్టమర్ ఫుడ్‌ను ఆర్డర్ చేయగా.. మరోసారి ఫుడ్ ఆర్డర్ చేయాలంటూ జొమాటో కోరింది. అయితే ఇంతకు ముందు కట్ అయిన డబ్బులు ఏమయ్యాయని కస్టమర్ అడిగాడు. దానికి జొమాటో స్పందిస్తూ.. ఆ […]

‘అమ్మ మీద ఒట్టు డబ్బులొస్తాయి’.. నవ్వులు పూయిస్తోన్న చాటింగ్
Follow us

| Edited By: Team Veegam

Updated on: Feb 14, 2020 | 1:38 PM

సోషల్ మీడియా పుణ్యమా అని ఎక్కడెక్కడో జరిగిన సంఘటనలు, ఫన్నీ వీడియోలు నిమిషాల్లో వైరల్‌గా మారుతున్నాయి. సరిహద్దుల్ని దాటేస్తూ ప్రపంచమంతా చుట్టేస్తున్నాయి. అలాంటిదే జొమాటో సంస్థ, కస్టమర్‌ మధ్య జరిగిన ఓ ఫన్నీ కన్వర్జేషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తోంది.

జొమాటోలో ఓ కస్టమర్ ఫుడ్‌ను ఆర్డర్ చేయగా.. మరోసారి ఫుడ్ ఆర్డర్ చేయాలంటూ జొమాటో కోరింది. అయితే ఇంతకు ముందు కట్ అయిన డబ్బులు ఏమయ్యాయని కస్టమర్ అడిగాడు. దానికి జొమాటో స్పందిస్తూ.. ఆ డబ్బులు నాలుగైదు రోజుల్లో మీ అకౌంట్‌లోకి వస్తాయంటూ తెలిపింది. దీనిపై నమ్మకం కలగని ఆ కస్టమర్.. ‘అమ్మ మీద ఒట్టు వేసి చెప్పండి.. కచ్చితంగా డబ్బులు వస్తాయి కదా’ అంటూ ప్రశ్నించగా.. జొమాటో సంస్థ ‘అమ్మ మీద ఒట్టు’ అంటూ సమాధానం ఇచ్చింది. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో వైరల్‌ అవ్వగా.. నెటిజన్లు కడుపుబ్బా నవ్వుకుంటున్నారు.