డాటర్స్ డే: నా ముద్దుల కూతురే నా ప్రాణంః నిర్మల

దేశవ్యాప్తంగా ఆదివారం నాడు డాటర్స్ డే జరుపుకున్నారు. కూతుర్లపై ప్రేమానురాగాలను తమదైన శైలిలో తెలుపుతూ ప్రముఖులందరూ ట్విట్టర్ వేదికగా ద్వారా ఫోటోలను పోస్ట్ చేశారు. ఈ కోవలోనే కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా చేరారు. తాజాగా ఆమె తన కూతురితో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక ఈ పిక్‌లో నిర్మలా సీతారామన్ నలుపు రంగు చీరలో.. తన కుమార్తె పరకాల వాఙ్మయిని ఎత్తుకొని.. అందమైన లొకేషన్‌లో ఈ ఫోటో […]

  • Ravi Kiran
  • Publish Date - 1:58 pm, Mon, 23 September 19
డాటర్స్ డే: నా ముద్దుల కూతురే నా ప్రాణంః నిర్మల

దేశవ్యాప్తంగా ఆదివారం నాడు డాటర్స్ డే జరుపుకున్నారు. కూతుర్లపై ప్రేమానురాగాలను తమదైన శైలిలో తెలుపుతూ ప్రముఖులందరూ ట్విట్టర్ వేదికగా ద్వారా ఫోటోలను పోస్ట్ చేశారు. ఈ కోవలోనే కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా చేరారు.

తాజాగా ఆమె తన కూతురితో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక ఈ పిక్‌లో నిర్మలా సీతారామన్ నలుపు రంగు చీరలో.. తన కుమార్తె పరకాల వాఙ్మయిని ఎత్తుకొని.. అందమైన లొకేషన్‌లో ఈ ఫోటో దిగినట్లు తెలుస్తోంది. ‘‘ కూతుళ్ల గురించి చాలా చెప్పొచ్చు’ అంటూ క్యాప్షన్ పెట్టగా… తన కుమార్తె తనకు స్నేహితురాలు, ఫిలాసఫర్, మార్గదర్శి అంటూ పేర్కొన్నారు. డాటర్స్ డే ని హ్యాష్ ట్యాగ్ చేసి.. అది త్రోబ్యాక్ పిక్‌గా పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మరోవైపు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ కూడా డాటర్స్ డే సందర్భంగా తన 16 ఏళ్ళ కుమార్తె మిరయా వాద్రా ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘‘ ఈ రోజు డాటర్స్ డే అని అందరూ అంటున్నారు. కానీ నన్ను అడిగితే రోజూ డాటర్స్ డేనే అంటాను’ అంటూ పిక్‌కు క్యాప్షన్ ఇచ్చారు.