లింగంపల్లి నుంచి తొలి స్పెషల్ రైలు.. ఎక్కడికంటే?

లింగంపల్లి నుంచి తొలి స్పెషల్ రైలు.. ఎక్కడికంటే?

38 రోజుల తర్వాత తెలంగాణలో ప్యాసింజర్ రైలు కదిలింది. దీంతో లాక్ డౌన్ ప్రకటించిన తర్వాత కదిలిన తొలి రైలుగా ఈ ప్రయాణం నిలిచిపోనుంది.

Rajesh Sharma

|

May 01, 2020 | 7:32 PM

38 రోజుల తర్వాత తెలంగాణలో ప్యాసింజర్ రైలు కదిలింది. దీంతో లాక్ డౌన్ ప్రకటించిన తర్వాత కదిలిన తొలి రైలుగా ఈ ప్రయాణం నిలిచిపోనుంది. హైదరాబాద్ శివార్లలోని లింగంపల్లి నుంచి బీహార్ రాజధాని పాట్నాకు తరలి వెళ్లింది మొట్టమొదటి ప్యాసింజర్ రైలు. శుక్రవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు లింగంపల్లి నుంచి బయలుదేరింది.

కేంద్ర ప్రభుత్వ సహకారంతో బీహార్ రాష్ట్రానికి చెందిన 1100 మంది వలస కార్మికులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారి స్వస్థలాలకు పంపింది. సంగారెడ్డి జిల్లా కంది సమీపంలోని ఐఐటీ హైదరాబాద్‌లో ఎల్ అండ్ టీ సంస్థ కొనసాగిస్తున్న భవన నిర్మాణాల్లో బీహార్, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన వలస కూలీలు పని చేస్తున్నారు. అయితే గత 38 రోజులుగా వీరికి సరైన ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారు. యాజమాన్యం వారికి కేవలం ఆహారం మాత్రమే ఇస్తూ కూలీ డబ్బులు ఇవ్వడం లేదని 2 రోజుల క్రితం ఈ వలస కూలీల ఆందోళన నిర్వహించారు. ఒక దశలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఎల్ అండ్ టి ఉద్యోగులపై దాడికి దిగారు. నియంత్రించేందుకు వచ్చిన సంగారెడ్డి జిల్లా పోలీసులపై దాడి చేశారు. పోలీసు వాహనాన్ని కూడా ధ్వంసం చేశారు.

ఈ నేపథ్యంలో వలస కార్మికుల దుస్థితిని తెలుసుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్ర హోంశాఖతో సంప్రదింపులు జరిపింది. ఈ వలస కూలీల బీహార్, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన వారుగా గుర్తించి.. అక్కడి బిజెపి నేతలకు కూడా సమాచారం అందించారు. దాంతో రంగంలోకి దిగిన బీహార్ రాష్ట్ర బిజెపి ఎంపీ నిశికాంత్ దూబే తన వంతు ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీనికి కేంద్ర హోంశాఖ కూడా ఆమోదం తెలపడంతో లింగంపల్లి నుంచి ప్రత్యేక రైలు ద్వారా ఈ 1100 మందిని తరలించాలని నిర్ణయించారు.

గురువారం అర్థరాత్రి దాటిన తర్వాత హైదరాబాద్ ఐఐటీ నుంచి 1100 మంది కార్మికులను 50 బస్సులలో లింగంపల్లి రైల్వే స్టేషన్‌కు తరలించారు. అనంతరం శుక్రవారం తెల్లవారుజామున లింగంపల్లి రైల్వే స్టేషన్ నుంచి ప్రత్యేక రైలు బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల వలస కార్మికులను తీసుకుని బయలుదేరింది. ఈ ప్రత్యేక రైలు ముందుగా బీహార్ రాజధాని పాట్నాకు చేరుకొని అక్కడి నుంచి జార్ఖండ్ రాజధాని రాంచీ వెళుతుందని రైల్వే అధికారులు తెలిపారు.

హైదరాబాదులో ఇప్పుడు ఈ ప్రాంతాలే కీలకం

ఉద్ధవ్ థాకరేకు ఎన్నికల కమిషన్ గుడ్ న్యూస్

లింగంపల్లి నుంచి తొలి స్పెషల్ రైలు.. ఎక్కడికంటే?

3 రోజుల్లో పీఎఫ్ సొమ్ము.. థాంక్స్ టు మోదీజీ!

డాక్టర్లపై అర్దరాత్రి దాడి.. బైకు దగ్ధం 

గ్రీన్ జోన్లలోనే సడలింపులు.. అందుకే వర్గీకరణ

‘తరుగు’ మోసాలపై సీఎం సీరియస్  

హైరిస్క్‌లో 4 వేల మంది.. తాజా లెక్కలతో సీఎం షాక్

ప్రత్యేక రైళ్లకు ప్రత్యేక ఆంక్షలు.. కేంద్రం భారీ కసరత్తు 

Big Breaking మరో రెండు వారాలు లాక్ డౌన్ 

రెడ్ జోన్ల చుట్టూ డీమార్కేషన్.. నిఘాకు ప్రత్యేక వ్యూహం  

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu