గూగుల్ పే యూజర్లకు గమనిక.. డబ్బులు పంపిస్తే ఎలాంటి ఛార్జీలు ఉండవు.. వివరణ ఇచ్చిన గూగుల్..

|

Nov 25, 2020 | 5:05 PM

వినియోగదారులకు గూగుల్ ప్లే గుడ్ న్యూస్ అందించింది. తక్షణ నగదు బదిలీకి భారత్‌లోని యూజర్లకు ఎలాంటి ఛార్జీలు ఉండవని స్పష్టం చేసింది.

గూగుల్ పే యూజర్లకు గమనిక.. డబ్బులు పంపిస్తే ఎలాంటి ఛార్జీలు ఉండవు.. వివరణ ఇచ్చిన గూగుల్..
Follow us on

Google Pay: వినియోగదారులకు గూగుల్ ప్లే గుడ్ న్యూస్ అందించింది. తక్షణ నగదు బదిలీకి భారత్‌లోని యూజర్లకు ఎలాంటి ఛార్జీలు ఉండవని స్పష్టం చేసింది. కేవలం అమెరికాలోని వినియోగదారులకు మాత్రమే ఇది వర్తిస్తుందని క్లారిటీ ఇచ్చింది. రీ-డిజైన్ చేసిన కొత్త గూగుల్ పే యాప్‌ను 2021లో యూజర్లకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు గూగుల్ గతవారం ప్రకటించిన సంగతి తెలిసిందే.

తొలుత అమెరికాలో ఈ ఫీచర్‌ను ప్రయోగాత్మకంగా లాంచ్ చేస్తామని.. దీని ద్వారా వెబ్​యాప్ సేవలు నిలిచిపోతాయని వివరించింది. అంతేకాకుండా గూగుల్ పే ద్వారా చేసే చెల్లింపులపై కూడా ఛార్జీలు వసూలు చేస్తామని ఓ ప్రకటనలో తెలిపింది. తాజాగా ఆ ప్రకటనపై గూగుల్ స్పష్టత ఇచ్చింది. భారత్‌లోని యూజర్లు ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని వెల్లడించింది. కాగా, ఇండియాలో 6.7 కోట్ల మంది గూగుల్ పే వాడుతున్న సంగతి విదితమే.

ఇది చదవండి: ఇకపై ల్యాండ్‌లైన్‌ నుంచి మొబైల్‌ ఫోన్‌కు కాల్ చేయాలంటే ‘0’ తప్పనిసరిగా చేర్చాల్సిందే.!