Facebook Livestream: ముంబైలో 23 ఏళ్ళ యువకుడు రేజర్ బ్లేడుతో గొంతు కోసుకుని ఆత్మహత్యా యత్నం చేశాడు. ఈ నెల 3 న రాత్రి దీన్ని ఫేస్ బుక్ లో లైవ్ స్ట్రీమ్ గా పెట్టడానికి యత్నించాడు. రక్తమోడుతూ, బాధతో విలవిలలాడుతున్న ఈ యువకుని స్థితి చూసి ఐర్లండ్ లోని ఫేస్ బుక్ ప్రధాన కార్యాలయం వెంటనే స్పందించింది. ముంబైలోని ధూలేలో ఉంటున్న ఇతని సమాచారాన్ని చిరునామాతో సహా పోలీసులకు చేరవేసింది. దీంతో కేవలం 10 నిమిషాల్లో పోలీసులు అక్కడికి చేరుకొని ఈ యువకుడిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఇతనికి ప్రాణాపాయం లేదని డాక్టర్లు తెలిపారు. కాగా ఐర్లండ్ లోని ఫేస్ బుక్ కార్యాలయం ఈ ఘటనపై స్పందించడం, ధూలే పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని ఇతడిని రక్షించడం స్థానికంగా సంచలనమైంది. ఎక్కడి ఐర్లండ్ ? ఎక్కడి ముంబై ? ఫేస్ బుక్ వంటి సాధనాలకు దూరాలతో నిమిత్తం లేదనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంటుందని అంటున్నారు.
అయితే ఆత్మహత్యా యత్నానికి పాల్పడినందుకు ఈ యువకునిపై పోలీసులు కేసు పెట్టవచ్ఛునని తెలుస్తోంది.
Also Read:
జనవరి 7న జేఈఈ అడ్వాన్స్డ్ తేదీలు ప్రకటిస్తాం: కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ ఫోఖ్రియాల్