హార్దిక్, నటాషాల జోడీపై.. మాజీ ప్రియుడి స్పందన ఇదే..!

కొత్త సంవత్సరం వేళ దుబాయ్‌లో టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా నటి, మోడల్ నటాషా స్టాన్‌కోవిచ్‌ను నిశ్చితార్థం చేసుకున్న సంగతి విదితమే. ఈ విషయాన్ని అతడే స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి ఫ్యాన్స్ అందరికి తెలిపాడు. ఇక ఈ పోస్ట్ కొద్దిసేపటికే వైరల్ అయింది. దీనిపై నటాషా మాజీ బాయ్ ఫ్రెండ్, టీవీ నటుడు అలై గోని స్పందించాడు. ‘హార్దిక్, నటాషాల జంట అద్భుతంగా ఉంది. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇద్దరూ చూడముచ్చటైన జంట. వాళ్ళ […]

హార్దిక్, నటాషాల జోడీపై.. మాజీ ప్రియుడి స్పందన ఇదే..!

Updated on: Jan 03, 2020 | 1:19 PM

కొత్త సంవత్సరం వేళ దుబాయ్‌లో టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా నటి, మోడల్ నటాషా స్టాన్‌కోవిచ్‌ను నిశ్చితార్థం చేసుకున్న సంగతి విదితమే. ఈ విషయాన్ని అతడే స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి ఫ్యాన్స్ అందరికి తెలిపాడు. ఇక ఈ పోస్ట్ కొద్దిసేపటికే వైరల్ అయింది. దీనిపై నటాషా మాజీ బాయ్ ఫ్రెండ్, టీవీ నటుడు అలై గోని స్పందించాడు. ‘హార్దిక్, నటాషాల జంట అద్భుతంగా ఉంది. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇద్దరూ చూడముచ్చటైన జంట. వాళ్ళ పెళ్లి ఘడియల కోసం ఎదురు చూస్తున్నానంటూ’ గోని తెలిపాడు.

అటు కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా హార్దిక్ ట్వీట్‌కు స్పందించి.. ‘కొత్త సంవత్సరంలో అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చావు. ఇద్దరికీ నా శుభాకాంక్షలు’ అంటూ పేర్కొన్నాడు. కాగా, గత కొంతకాలంగా హార్దిక్ పాండ్యా నటాషాతో డేటింగ్‌లో ఉన్నాడు. ఇక వారి బంధాన్ని కొత్త సంవత్సరం రోజున బయటపెట్టాడు.